‘ పవన్‌తో డేటింగ్ , నాగార్జునతో లవ్ .. అది మాత్రం ఆయనతోనే ’
కొందరు హీరోయిన్లకు అందం, అభినయంతో పాటు డ్యాన్స్, సింగింగ్ ఇలా మల్టీ టాస్కర్స్ అయినప్పటికీ వారి కెరీర్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంటుంది. ఒకటి రెండు సినిమాలతో మెరుపులు మెరిపించడం ఆ తర్వాత ఫేడ్ అవుట్ కావడం అన్నట్లుగా వీరి పరిస్ధితి ఉంటుంది. ఈ కోవలోకే వస్తారు అచ్చ తెలుగు అమ్మాయి, పక్కా హైదరాబాదీ ఫరియా అబ్ధుల్లా. జాతిరత్నాలు వంటి బ్లాక్‌బస్టర్‌ను చూసి ఈ ముద్దుగుమ్మ ఆ జోష్‌ను కొనసాగించడంలో ఎందుకో వెనుకబడిపోయింది.

జాతిరత్నాలతో ఫరియాకు బ్రేక్
జాతి రత్నాలులో చిట్టిపాత్రతో ఫరియా అబ్ధుల్లా మెస్మరైజ్ చేశారు. ఆరడుగుల హైట్, అమాయకమైన నవ్వుతో ఆకట్టుకున్నారు. అప్పటి నుంచి అసలు పేరు కంటే చిట్టి అంటేనే జనాలు బాగా గుర్తుపట్టారు. కుర్రాళ్లు కూడా తమ గర్ల్‌ఫ్రెండ్స్‌ని చిట్టి అనే పిలిచేవారంటే ఫరియా క్యారెక్టర్ జనంలోకి ఎలా వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. జాతిరత్నాలు హిట్‌తో ఆమె తెలుగునాట స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. దీనికి తోడు భారీ హైట్ ఉండటంతో పెద్ద స్టార్స్ నుంచి ఆఫర్లు వస్తాయని ఊహించారు. కానీ ఫరియాకు అవకాశాలు రావడానికి టైం పట్టింది.
అవకాశాల కోసం ఫరియా వెయిటింగ్
మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌లో గెస్ట్ రోల్, బంగార్రాజులో ఐటెం సాంగ్స్ చేయాల్సిన పరిస్ధితి వచ్చింది. ఆ తర్వాత లైక్ షేర్ సబ్‌స్క్రైబ్‌లో హీరోయిన్‌గా నటించగా.. రావణాసురలో ఓ సైడ్ క్యారెక్టర్ చేయాల్సి వచ్చింది. తర్వాత ఆ ఒక్కటి అడక్కు, కల్కి 2898 ఏడీ, మత్తువదలరా 2 చిత్రాలలో నటించగా.. వీటిలో కల్కి హిట్ అయినా అందులో ఫరియాది గెస్ట్ రోల్. మిగిలిన సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. దీంతో ఆమె కెరీర్ ఎటు వెళ్తుందోనని టాలీవుడ్‌లో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో కోలీవుడ్‌పై ఫోకస్ చేసిన ఫరియా అబ్ధుల్లా తమిళంలో తొలిసారిగా వల్లి మయిల్ అనే సినిమాలో చేస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాపై ఫరియా ఎన్నో ఆశలు పెట్టుకుంది.
కోలీవుడ్‌లో క్రేజీ ఆఫర్లు
కోలీవుడ్‌లో అడుగుపెట్టిందో లేదో ఆమెకు మరో క్రేజీ ఆఫర్ దొరికినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. అగ్రనటుడు, ఇళయ దళపతి విజయ్ వారసుడు జసన్ సంజయ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఆయన డెబ్యూ మూవీలో హీరోయిన్‌గా ఫరియా ఎంపికైనట్లుగా కోలీవుడ్ టాక్. లైకా ప్రొడక్షన్ వంటి బడా నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా విష్ణువిశాల్ ఇందులో హీరోగా నటించనున్నారు. ఈ సినిమాలు కనుక హిట్ అయితే కోలీవుడ్‌లో ఫరియా గట్టిగా జెండా పాతడం ఖాయమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటా
ఇక ఫరియా అబ్ధుల్లాకు టాలీవుడ్ అగ్రనటులు నాగార్జున, పవన్ కళ్యాణ్, ప్రభాస్ అంటే ఎంతో ఇష్టం. వీరితో ఎప్పటికైనా నటిస్తానని చాలా సార్లు చెప్పిది. తాజాగా యాంకర్ సుమ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో ఈ ముగ్గురు సూపర్‌స్టార్ల గురించి ఫరియా కీలక వ్యాఖ్యలు చేసింది. ముగ్గురు సెలబ్రెటీలతో డేటింగ్, లవ్, మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తే ఎవరి పేర్లు చెబుతారని సుమ అడుగుతుంది. దీనికి ఫరియా స్పందిస్తూ.. తనకు అవకాశం వస్తే యంగ్ పవన్ కళ్యాణ్‌తో డేటింగ్, యంగ్ నాగార్జునతో లవ్ చేయాలని ఉందని.. ప్రభాస్‌ని పెళ్లాడాలని ఉందని చెప్పింది. దీంతో సుమ షాకైంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఫుల్ ఎపిసోడ్ త్వరలోనే రానుంది.


Click it and Unblock the Notifications











