మరో కామెడీ సినిమాలో జాతిరత్నాలు హీరోయిన్.. హిట్ కాంబినేషన్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత గట్టిగానే ఉంది. మొన్నటివరకు మీడియం బడ్జెట్ సినిమాలు చేసిన వారు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అనేస్తున్నారు. ఇక కొత్తగా వచ్చే వారికి కాస్త అవకశాలు ఎక్కువగానే వస్తున్నాయి. అయితే జాతిరత్నాలు లాంటి బాక్సాఫీస్ హిట్ అందుకున్నప్పటికి హీరోయిన్ ఫారియా అబ్దుల్లా ఎక్కువ అవకాశాలు అందుకోకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
ఫారియా అబ్దుల్లా ఎక్కువగా హైట్ తో ఉండడం కూడా ఆమెకు కొంత మైనెస్ అని చెప్పవచ్చు. గ్లామర్ పాత్రలు చేయడానికి రెడీగానే ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం ఆమె రేంజ్ కు తగ్గట్లుగా చేసే హీరోలు హైట్ చూసి కాస్త కంగారు పడుతున్నారట. ఇక మొత్తానికి మంచు విష్ణు మాత్రం సినిమా చేయడానికి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఒక విధంగా ఇద్దరి హైట్ కు కరెక్ట్ గానే సెట్టవుతుందని చెప్పవచ్చు.

ఇక మంచు విష్ణు ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో డీ సీక్వెల్ లో నటించడానికి సిద్ధమవుతున్నాడు. డీ అండ్ డీ టైటిల్ తో సిద్దమవుతున్న ఆ సినిమా కథ ఆల్ మోస్ట్ పూర్తయినట్లు సమాచారం. ఇక హీరోయిన్ ఫారియా బావుంటుందని మంచు విష్ణు సజెస్ట్ చేయగా శ్రీను వైట్ల కూడా వెంటనే ఒప్పేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని మంచు విష్ణు ఫిట్నెస్ లో కూడా మార్పులు చేస్తున్నాడు. ఇక శ్రీను వైట్ల కూడా కసిమీద వర్క్ చేస్తున్నాడు. మరి సినిమా ఏ స్థాయిలో హిట్టవుతుందో చూడాలి. లాక్ డౌన్ అనంతరం సినిమా సెట్స్ పైకి రావచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











