Faria Abdullah : చీరలో చిట్టి అందాలు .. డీప్ నెక్‌లో సోకుల విందు, ఆ నడుము చూస్తే

జాతిరత్నాలు సినిమాతో తెలుగు వారిని ఆకట్టుకున్నారు హైదరాబాద్ పిల్ల ఫరియా అబ్ధుల్లా . హీరోల రేంజ్‌లో హైట్‌తో , మెస్మరైజింగ్ స్మైల్‌తో ఫరియా రెచ్చిపోయారు. జాతిరత్నాల్లో చిట్టిగా అలరించిన ఆమె తర్వాత ఆ స్థాయిలో హిట్ అందుకోలేదు. అయినప్పటికీ తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఫరియా. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఫరియా అబ్ధుల్లా పూర్తి పేరు.. ఫరియా సుల్తానా బేగం. ఈమె తల్లిదండ్రులు సంజయ్ అబ్ధుల్లా, కసూర్ సుల్తానా. అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన జాతిరత్నాలు సినిమాతో తెలుగువారిని పలకరించారు ఫరియా అబ్ధుల్లా. తర్వాత మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, బంగార్రాజు, లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటి ఆడక్కు, కల్కి 2898 ఏడీ, మత్తు వదలార 2 సినిమాలతో అభిమానులను పలకరించారు ఫరియా అబ్దుల్లా. ప్రస్తుతం తమిళ్‌లో వల్లి మయిల్‌ సినిమాలో నటిస్తున్నారు.

Faria Abdullah PhotoShoot with orange color saree Her latest photos here

ఫరియా అబ్ధుల్లా మల్టీ టాలెంటెడ్. ఇటీవల విడుదలైన మత్తు వదలరా 2లో సొంతంగా ర్యాప్ సాంగ్ రాసిన ఆమె.. స్వయంగా ఆలపించారు. అంతేకాదు ఈ సాంగ్‌కి ‌కొరియోగ్రఫి కూడా ఫరియానే చేశారు. థియేటర్ ఆర్టిస్ట్‌గా, యూట్యూబర్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంతటి టాలెంటెడ్ పర్సన్‌కి ఇండస్ట్రీలో దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని అంటున్నారు. ఆఫర్లు అయితే వస్తున్నాయి కానీ.. కెరీర్‌ని మలుపు తిప్పే అవకాశం మాత్రం ఇప్పటి వరకు ఆమెను పలకరించలేదు. దీంతో అందాల విందుకు సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి.

హీరోయిన్లపై రూమర్స్ రావడం ఇండస్ట్రీలో కామన్. పెళ్లీడుకు వచ్చేసిన ఈ ముద్దుగుమ్మపైనా కొన్ని గాసిప్స్ వైరల్ అయ్యాయి. మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో మీకు ఎలాంటి భర్త కావాలి.. అతనికి ఎలాంటి లక్షణాలు ఉండాలని మీడియా ప్రశ్నించింది. తనకు కాబోయే భర్త జోవియల్‌గా ఉండాలని.. ఎందుకంటే జీవితంలో ఎన్నో బాధలు ఉంటాయి కాబట్టి జోక్స్ వేసి నవ్వించడం చేయాలని చెప్పింది. ఫన్‌గా ఉంటే అతనికి హైట్ లేకపోయినా పర్లేదని హింట్ ఇచ్చేసింది.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఫరియా అబ్ధుల్లా సినిమాలు, వ్యక్తిగత వివరాలతో పాటు హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో మతిపొగొట్టేస్తుంది. ఆమె పోస్ట్ చేసే రీల్స్, వీడియోస్‌ బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆరెంజ్ కాలర్ శారీలో ఆమె చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది. నడుము మడతలు, స్లీవ్ లెస్ డీప్ నెక్ బ్లౌజ్‌లో ఫరియా అందాలు కవ్విస్తున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్ వేయండి.

More from Filmibeat

Read more about: faria abdullah movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X