డైరెక్టర్‌గా మారతానంటున్న యంగ్ హీరోయిన్.. ప్లానింగ్ మామూలుగా లేదుగా..
టాలీవుడ్‌లో ఇప్పటికే తన అందం, నటనతో యూత్‌ను ఆకట్టుకున్న ఓ హీరోయిన్... ఇప్పుడు కెరీర్‌లో ఓ కీలక నిర్ణయం తీసుకోబోతుంది. తెరపై తన నటనతో మెప్పించింది. తన డ్యాన్స్ అదే సమయంలో తన డ్యాన్స్, గాత్రంతో ప్రేక్షకులను అలరించింది. అయితే.. ఈ బ్యూటీ, త్వరలోనే కెమెరా వెనుక నిలబడి మెగాఫోన్ పట్టాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కొన్ని కథలు సిద్ధం చేసుకుంటూ, డైరెక్టర్‌గా కొత్త ప్రయాణానికి రెడీ అవుతోందట. ఇంతకీ ఈ స్టార్ హీరోయిన్ ఎవరు? ఏమిటి ఆమె ప్లాన్? ఇప్పుడు ఇదే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఆ హీరోయిన్ ఎవరు కాదు.. ఫరియా అబ్దుల్లా (Faria Abdullah). 'జాతిరత్నాలు' సినిమాతో 'చిట్టి'గా పరిచయమైన ఫరియా అబ్దుల్లా, తొలి చిత్రంతోనే ఓవర్‌నైట్ స్టార్ అయింది. తన సహజ నటన, చలాకీతనం, కామెడీ టైమింగ్‌తో యూత్‌లో భారీ క్రేజ్ సంపాదించింది. అయితే ఆ సక్సెస్ తర్వాత ఆమెకు వరుసగా భారీ అవకాశాలు రాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో చిన్న క్యామియో చేశారు. ఆ తరువాత బంగార్రాజు లో ఐటెం సాంగ్ చేసింది. ఈ సాంగ్ తో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. ఆమెకు సరైన బ్రేక్ మాత్రం రాలేదనే చెప్పాలి. ఆ తర్వాత లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ అనే సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.

ఇప్పుడు ఫరియా ఆశలు అన్నీ 'గాయపడ్డ సింహం' మీదే ఉన్నాయి. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తుండగా, ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా కనిపించనున్నారు. ఫరియా ఈ సినిమాలో "శాలిని" అనే వ్లాగర్ పాత్రలో కనిపించనుంది. చిన్న పాత్ర అయినప్పటికీ కథలో కీలకంగా ఉంటుందని ఆమె తెలిపింది. ఇలా ఈ అమ్మడు టాలీవుడ్‌లో తన ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. ఇప్పుడు కెరీర్‌లో కొత్త మలుపు తీసుకోబోతున్నారు.
హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ బ్యూటీ... ఇక మెగాఫోన్ పట్టి దర్శకురాలిగా మారాలని ప్లాన్ చేస్తున్నారు. గాయపడ్డ సింహం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా మల్టిపుల్ లేయర్స్‌తో సాగే కథగా ఉంటుందని, ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని ఫరియా వివరించింది. పలు దర్శకులతో కలిసి పని చేయడం తనకు కొత్త అనుభవం ఇచ్చిందని ఫరియా తెలిపింది. సెట్స్‌లో సినిమా మేకింగ్, కథా నిర్మాణం, నటన గురించి చాలా నేర్చుకున్నానని, ఇవే తనను డైరెక్షన్ వైపు ఆకర్షించాయని చెప్పింది.
ఫరియా ఇంకా మాట్లాడుతూ.. 'ప్రస్తుతం కొన్ని కథలు రాస్తున్నాను. వచ్చే ఏడాది నా దర్శకత్వంలో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాను'అని వెల్లడించింది. ఇది కేవలం ఆలోచన స్థాయిలో కాదు... కథలు సిద్ధం చేసుకుంటూ సీరియస్‌గా ప్రయత్నిస్తున్నట్లు తెలియజేసింది. అంతేకాదు.. అవకాశం వస్తే.. తర్వలోనే మెగాఫోన్ పట్టుకోవడానికి సిద్దంగా ఉన్నట్టు చెప్పింది. ప్రస్తుతం ఫరియా 'భగవంతుడు', 'సిగ్మా' వంటి చిత్రాలతో పాటు సత్య దేవ్ తో ఒక ప్రాజెక్ట్ కూడా చేస్తోంది. దీంతో ఆమె కెరీర్ మళ్లీ ట్రాక్‌లోకి వస్తోందని చెప్పవచ్చు.
హీరోయిన్‌గా గుర్తింపు వచ్చిన తర్వాత డైరెక్టర్‌గా మారడం చిన్న విషయం కాదు. కానీ ఫరియా అబ్దుల్లా మాత్రం ఆ ఛాలెంజ్‌ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే కథలు రాస్తూ, తన విజన్‌ను సిద్ధం చేసుకుంటున్న ఈ యంగ్ హీరోయిన్... రాబోయే రోజుల్లో దర్శకురాలిగా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఆమె మెగాఫోన్ పట్టిన తర్వాత టాలీవుడ్‌కు కొత్త స్టైల్ ఆఫ్ నేరేషన్ వస్తుందా? లేక ఇది కూడా ఒక ప్రయోగంగా మిగిలిపోతుందా? అన్నది కాలమే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications