ఆ కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చా.. అసలు విషయం చెప్పిన యంగ్ హీరోయిన్..

యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ, తొలి చిత్రంతోనే ఓవర్‌నైట్ స్టార్‌గా మారింది. తన అందం, చలాకీతనం, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మనసులు దోచుకుంది. జాతిరత్నాలు విజయంతో ఫరియాకు మంచి గుర్తింపు వచ్చినా, ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం వరుసగా రాలేదు.ఈ తరువాత ఈ భామ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలో చిన్న క్యామియో రోల్ చేశారు. ఆ తరువాత బంగార్రాజు మూవీలో ఐటెం సాంగ్ ను కూడా చేసింది ఈ భామ.సంతోష్ శోభన్ తో నటించిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.

ప్రస్తుతం దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన 'గాయపడ్డ సింహం' (Gaayapadda Simham) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ యమా జోరుగా నడుస్తున్నాయి. ఈ ప్రమోషన్స్ లో భాగం ఓ ఈవెంట్స్ లో ఫరియా అబ్దుల్లా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ముఖ్యంగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ పై తనకున్న అభిమానాన్ని బయటపెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది.

Faria Abdullah Reveals Huge Crush on Dulquer Salmaan During Gaayapadda Simham Promotions

ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. 'నేను మొదటిసారి ఛార్లే (Charlie) సినిమా చూసినప్పుడు అందులో హీరోయిన్గా నన్ను నేనే ఊహించుకున్నాను. ఆ సినిమా చూసినప్పటి నుంచి దుల్కర్ సల్మాన్‌పై నాకు ప్రత్యేకమైన అభిమానముంది. ఆయనంటే నాకు చాలా పిచ్చి అభిమానం' అంటూ హీరో దుల్కర్ సల్మాన్ అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పుకొచ్చింది. అంతేకాదు.. "ఇప్పటికైనా దుల్కర్ సల్మాన్‌ను ఒకసారి కలవాలనే కోరికతోనే నేను ఇండస్ట్రీలోకి వచ్చానని చెప్పొచ్చు" అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె చెప్పిన ఈ మాటలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

ఫరియా తన తొలి సినిమా జాతి రత్నాలు (Jathi Ratnalu) ప్రమోషన్స్ సమయంలో జరిగిన ఓ సరదా సంఘటనను కూడా గుర్తు చేసుకుంది. "ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేము ఓ క్రియేటివ్ క్యాంపెయిన్ చేశాం. అందులో దుల్కర్ సర్‌ను కూడా ఇన్వాల్వ్ చేస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేశాం. మేము ట్యాగ్ చేసిన పోస్టుకు దుల్కర్ గారు రిప్లై ఇచ్చారు. అది చూసిన క్షణంలో నేను షాక్ అయ్యాను" అని తెలిపింది. ఆ తర్వాత జరిగిన ఘటనను చెప్పుతూ.. "ఆ ఎక్సైట్మెంట్‌లో నా ఫోన్‌ను పైకి విసిరేశాను. పక్కనే ఉన్న కో-ఆర్టిస్టులు ఏమైంది? ఏమైంది? అంటూ భయపడ్డారు. అప్పుడు నేను మెల్లగా కోలుకుని.. ఏం లేదు, చిన్న హార్ట్ బ్రేక్ అని ఫన్నీగా చెప్పాను" అంటూ నవ్వించింది.

నిజంగా తాను దుల్కర్ సల్మాన్‌కు పెద్ద అభిమానినని, ఆయన నటన, వ్యక్తిత్వం చాలా ఇష్టమని ఫరియా వెల్లడించింది. దీంతో ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా "ఫరియా క్రష్ చాలా క్యూట్‌గా ఉంది", "దుల్కర్‌కు ఇలాంటి ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X