నా లైఫ్‌లో ఆ బాధలు అనుభవించా.. అలాంటి భర్త కావాలి.. ఫరియా అబ్దుల్లా

జాతి రత్నాలు మూవీతో తెలుగు ఆడియన్స్ మనసులో చిట్టిగా చెరగని ముద్ర వేసుకున్న హైదరాబాద్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. ఈ తెలుగు హీరోయిన్ తాజాగా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అనే విషయాన్ని బయట పెట్టింది. మరి ఇంతకీ భర్తలో ఫరియా అబ్దుల్లాకు కావలసిన లక్షణాలు ఏంటి? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా 2021లోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించింది. కానీ ఈ బ్యూటీకి గుర్తింపును తీసుకొచ్చిన మూవీ మాత్రం జాతిరత్నాలే. నవీన్ పోలిశెట్టి హీరోగా డైరెక్టర్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో ఫరియా హీరోయిన్ గా నటించింది. అందులో చిట్టి పాత్రకు ప్రాణం పోసి థియేటర్లలో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించింది.

Faria Abdullah reveals qualities of Husband and Marriage in A Okkati Adagaku promotion

తన చిరునవ్వుతో యూత్ గుండెలపై చెరగని ముద్ర వేసింది ఈ చిన్నది నటనపరంగా కూడా మంచి మార్కులే కొట్టేసింది. ఇక అప్పటి నుంచి చిట్టికి యూత్ అంతా ఫిదా అయిపోయారు. ఆ సినిమా తర్వాత ఫరియాకు వరుసగా అవకాశాలు వస్తాయి అనుకుంటే సీన్ రివర్స్ అయ్యింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫరీయాకు పెద్దగా ఆఫర్లు ఏమీ రాలేదు.

దానికి కారణం ఆమె హైట్. ఫరియా అబ్దుల్లా ఆరడుగుల ఎత్తు ఉంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రిలో ఉన్న చాలా మంది స్టార్ హీరోలు ఆమె హైట్ ను అందుకోవడం కష్టమే. అందుకే ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు రావట్లేదు. అడపా దడపా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటే సోషల్ మీడియాలో తరుచుగా ఫ్యాన్స్ కు గ్లామర్ ట్రీట్ ఇస్తూ వార్తల్లో నిలుస్తోంది.

Faria Abdullah reveals qualities of Husband and Marriage in A Okkati Adagaku promotion

వాటి సంగతి అలా పక్కన పెడితే బెల్లీ డ్యాన్స్ తో అభిమానులను ఫిదా చేసే ఫరియా ప్రస్తుతం ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాలో నటిస్తోంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ మూవీలో అల్లరి నరేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. మొట్టమొదటి సారిగా ఈ జంట థియేటర్లలో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది.

మే 3న ఆ ఒక్కటి అడక్కు మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే ఫరియా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అనే విషయాన్ని బయట పెట్టింది. హైట్ తక్కువగా ఉన్నా పర్లేదు గానీ ఆ ఒక్కటి మాత్రం తక్కువగా ఉండొద్దు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా దగ్గర ఆమె పెళ్లి ప్రస్తావన వచ్చింది. దీంతో ఈ హైదరాబాద్ బ్యూటీ స్పందిస్తూ నేను ఆరడుగుల ఎత్తు ఉంటాను. అయితే నాకు కాబోయే భర్త నాకంటే హైట్ తక్కువగా ఉన్నా పర్లేదు గాని అతనిలో హాస్య చతురత మాత్రం ఎక్కువగా ఉండాలి అంటూ అసలు విషయం చెప్పేసింది.

మరి అలాంటి వాడే ఎందుకు కావాలి అంటే తాను లైఫ్ లో ఎన్నో బాధలు అనుభవించాను కాబట్టి రాబోయే భర్త ఫన్ గా ఉంటే లైఫ్ సంతోషంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇలాంటి లక్షణాలు ఉన్నవాడినే భర్తగా కోరుకుంటున్నానని పేర్కొంది. ఇక ఆ ఒక్కటి అడక్కు మూవీ కూడా పెళ్లి కోసం తహతహలాడే ఓ అబ్బాయి జీవితం నేపథ్యంలోనే రాబోతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X