twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జాతిరత్నాలు బ్యూటికి మరో బంపర్ ఆఫర్.. ఐటెమ్ సాంగ్ కోసం సాలీడ్ రెమ్యునరేషన్!

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్స్ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఐటెమ్ సాంగ్స్ చేయడానికి కూడా ఎంతగానో ఆసక్తిని చూపిస్తున్నారు. అలా చేస్తే సినిమాలు ఫెయిల్యూర్ అయినా కూడా వారి కెరీర్ పెద్దగా ప్రభావం పడదు. సాంగ్ హిట్ అయితే చాలా తప్పకుండా క్రేజ్ మాత్రం మరింత పెరుగుతోందని చెప్పవచ్చు. ఇక ఆ విషయంలో కూడా హీరోయిన్స్ ఐతే చాలా ఆలోచించి సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక త్వరలోనే జాతి రత్నాలు బ్యూటీ కూడా ఒక స్పెషల్ ఐటెమ్ సాంగ్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఆమెకు సాలిడ్ రెమ్యునరేషన్ కూడా అందే అవకాశం ఉండట.

     మొదటి సినిమాతోనే భారీ విజయం

    మొదటి సినిమాతోనే భారీ విజయం

    జాతి రత్నాలు సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న క్యూట్ టాల్ గర్ల్ ఫారియా అబ్దుల్లా కుర్రాళ్ళను ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె నవ్వుకు ఇలాగే క్యూట్ హావభావాలకు అబ్బాయిలు అందరూ కూడా ఫిదా అయ్యారు. విడుదలకు ముందే ఈ సినిమా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయడంతో రైతులకు అనేక రకాల ఆఫర్స్ కూడా వచ్చాయి. కానీ అమ్మడు మాత్రం తొందర పడకుండా కేవలం మంచి సినిమాలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంది. ఇక జాతిరత్నాలు సినిమా హిట్ అవడంతో ఆమె ఆలోచన విధానం కూడా పూర్తిగా మారిపోయింది.

    ప్రభాడ్ కూడా ఆశ్చర్యపోయాడు

    ప్రభాడ్ కూడా ఆశ్చర్యపోయాడు

    అనుష్క తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో మళ్ళీ ఆమాత్రం ఎత్తు కలిగిన హీరోయిన్లలో ఫారీయా ఒకరు. జాతి రత్నాలు ప్రమోషన్ సమయంలో ప్రభాస్ కూడా ఫారియా హైట్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా క్రేజ్ అందుకోబోతున్నట్లు అప్పటికే చిత్ర యూనిట్ బాగా ఆమెను ప్రమోట్ చేసింది.

    ఆ సినిమాలో మేయిన్ హీరోయిన్..

    ఆ సినిమాలో మేయిన్ హీరోయిన్..

    అయితే హైట్ ఫారియాకు పెద్ద మైనస్ గా మారింది. కొంతమంది హీరోలు మాత్రమే ఆమెకు సరిపడే హైట్ తో ఉండడంతో అవకాశాలు రావడం కాస్త కష్టంగానే మారింది. చాలా మంది హీరోలు ఆమెకు సరిపోరు అనే చెప్పాలి. మంచు విష్ణుతో అయితే ఒక సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న డీ అండ్ డీ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కనిపించబోతోంది. ఆ సినిమా సక్సెస్ అయితే ఈ బ్యూటీ కెరీర్ మరో దశ తిరిగినట్లే.

     నాగార్జునతో ఐటెమ్ సాంగ్

    నాగార్జునతో ఐటెమ్ సాంగ్

    ఇక కొందరు మాత్రం అమ్మడితో ప్రత్యేకమైన స్టెప్పులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక నాగార్జున సినిమాలో అమ్మడికి స్పెషల్ ఐటెమ్ సాంగ్ చేసే ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. సోగ్గాడే చిన్న నాయనా సినిమాకు కొనసాగింపుగా బంగార్రాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న నాగార్జున అందులో అన్ని కమర్షియల్ అంశాలతో ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక స్పెషల్ ఐటెమ్ సాంగ్ లో ఫారియా అబ్దుల్లా కూడా చిందులు వేయబోతున్నట్లు తెలుస్తోంది.

    Recommended Video

    PanIndia చిత్రాలకు పోటీగా Bheemla Nayak | RRR Vs Radhe Shayam || Filmibeat Telugu
    సాలీడ్ రెమ్యునరేషన్..?

    సాలీడ్ రెమ్యునరేషన్..?

    ఇక ప్రస్తుతం కొంతమంది స్టార్ హీరోయిన్స్ ఐటెమ్ సాంగ్స్ కోసం కోట్లల్లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఇక ఫారియా అబ్దుల్లా ఇప్పుడిప్పుడే సక్సెస్ అవుతోంది కాబట్టి ఆమె ఏ స్థాయిలో డిమాండ్ చేసి ఉంటుందో అనే కామెంట్స్ కూడా వసగున్నాయి. అయితే అమ్మడికి మాత్రం రెగ్యులర్ రెమ్యునరేషన్ కంటే కాస్త ఎక్కువగానే లక్షల్లో సాలీడ్ అమౌంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

    English summary
    Faria Abdullah solid remuneration for nagarjuna bangarraju item song,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X