కడుపుతో ఉన్న హీరోయిన్ కి అసభ్య మెసేజ్ లు.. పోలీసుల అదుపులో ఫ్యాషన్ డిజైనర్ కుమారుడు?
బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంజనా గల్రానీ ఆ తర్వాత అనేక తెలుగు సినిమాల్లో చేసినా పెద్ద క్రేజ్ మాత్రం తెచ్చుకోలేక పోయింది. ఆ మధ్య డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలు జీవితం గడిపి వచ్చిన ఆమె ఆ తరువాత ఒక క్యాబ్ డ్రైవర్ తనను ఇబ్బంది పెట్టాడు అంటూ రచ్చ రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె కడుపుతో ఉండగా ఆమెకు అసభ్య మెసేజులు పంపిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ వివరాల్లోకి వెళితే...

హిట్ అయినా
సోగ్గాడు అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంజన ఆ తర్వాత తమిళ సినిమాతో హీరోయిన్ గా మారింది. అయితే స్వతహాగా కర్ణాటకకి చెందిన ఈ భామ దాదాపు ఐదారు కన్నడ సినిమాల్లో కూడా నటించింది. అయితే ఈ భామకు కాస్త గుర్తింపు తెచ్చి పెట్టిన సినిమా ఏదైనా ఉంది అంటే అది ప్రభాస్ త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన బుజ్జిగాడు అనే సినిమానే. ఆ సినిమాలో ఆమె త్రిష చెల్లెలుగా నటించింది కానీ ఆ సినిమా హిట్ అయినా ఆమెకు కలిసి రాలేదు.

ఏదీ కలిసి రాలేదు
ఆ తర్వాత కూడా తెలుగులో చాలా సినిమాలు చేసినా పెద్దగా ఈ భామకు లక్కు మాత్రం కలిసి రాలేదు. ఆ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో సత్యమేవ జయతే అనే సినిమాలో కూడా అవకాశం వచ్చింది. ఆ తర్వాత సమర్థుడు, పోలీస్ పోలీస్, దసరా, ముగ్గురు, యమహో యమ, నేనేం చిన్నపిల్లనా, జగన్ నిర్దోషి, ఐ లవ్ యూ బంగారం, సర్దార్ గబ్బర్ సింగ్, అవును2, 2 కంట్రీస్ అనే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ ఏదీ కలిసి రాలేదు.

రెస్ట్ మోడ్ లో
గత ఏడాది నుంచి అనేక వివాదాల్లో చిక్కుకుని ఏకంగా డ్రగ్స్ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించిన ఆమె మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి చూస్తోంది. అలాంటి సమయంలో ఆమె గర్భవతి అని తేలడంతో ప్రస్తుతానికి రెస్ట్ మోడ్ లో ఉంది. అయితే సంజన గల్రానికి ఓ ఫొటోగ్రాపర్ అర్దరాత్రి సమయంలో కొన్ని అశ్లీల మెసేజ్‌లు పంపాడు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అశ్లీల మెసేజ్‌లు, వీడియోలు
అసలు విషయం ఏమిటంటే సంజనకు ఇది వరకు ఆడం బిడ్డప్ప అనే ఫొటోగ్రాఫర్‌తో పరిచయం ఉండేది. సంజన పెళ్లి చేసుకున్న తర్వాత కొంత సినిమాలకు దూరం, అయింది. అయితే ఏమయిందో ఏమో ఆడం బిడ్డప్ప నుంచి ఆమె ఫోన్ కి అశ్లీల మెసేజ్‌లు, వీడియోలు వచ్చాయి. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
Recommended Video

ఫ్యాషన్ డిజైనర్ కుమారుడిని
రంగంలోకి దిగిన పోలీసులు ఆడంబిడ్డప్ప పిలిచి విచారించగా, తానెలాంటి అశ్లీల మెసేజ్‌లు పంపలేదని అతడు చెప్పాడు. పోలీసులు ఫోన్‌ను చెక్ చేయగా అందులో చాట్ చేసిన ఆధారాలు దొరకలేదు. దీంతో వారు.. ఆ ఫోన్‌ని ఫొర్సెనిక్ ప్రయోగశాలకు పంపారు. కేసు విచారణలో ఉంది. అయితే ఓ ఫ్యాషన్ డిజైనర్ కుమారుడిని ఇందిరానగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











