twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకు లైంగిక వేధింపులు నిజమే, అది నా వ్యక్తిగతం: ‘దంగల్’ హీరోయిన్

    |

    బాలీవుడ్ నటి, దంగల్ మూవీ ఫేం ఫాతిమా సనా షేక్ తాజాగా మరోసారి తనకు ఎదురైన #మీటూ అనుభవం గురించి, సెక్సువల్ హరాస్మెంట్ గురించి వెల్లడించారు. అయితే ఆ సంఘటనకు సంబంధించిన విషయాలను పంచుకోవడానికి ఆమె ఇష్టపడేలేదు. తాను బాలీవుడ్లోకి మెయిన్ స్ట్రీమ్ యాక్టర్‌గా రావడానికి చాలా రోజుల ముందే తనకు లైంగిక వేధింపులు ఎదురైనట్లు తెలిపారు.

    తాజాగా ఫాతిమా ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ... లైంగిక వేధింపుల సమస్య అనేది కేవలం సినిమా ఇండస్ట్రీకి, బాలీవుడ్‌కు సంబంధించిన అంశం కాదని, అన్ని చోట్లా, అన్ని రంగాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు.

    తప్పుగా అర్థం చేసుకుంటున్నారు

    తప్పుగా అర్థం చేసుకుంటున్నారు

    #మీటూ ఉద్యమం అనేది కేవలం బాలీవుడ్ పరిశ్రమకు చెందినదే అంటూ చాలా మంది ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సినిమా రంగంలో లేని చాలా మందికి ఇలాంటి #మీటూ అనుభవాలు ఎదురవుతున్నాని తెలిపారు.

    ప్రతి ఒక్కరూ ఆ విషయాలను బయటకు చెప్పాల్సిన అవసరం లేదు

    ప్రతి ఒక్కరూ ఆ విషయాలను బయటకు చెప్పాల్సిన అవసరం లేదు

    ‘‘చాలా మంది #మీటూ సమస్య ఈ మధ్యనే మొదలైందని భావిస్తున్నారు. అది నిజం కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉంది. నేను దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ దేశంలో ప్రతి మహిళ ఇలాంటివి ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనే ఉంటారు. వారంతా ఆ విషయాలను పబ్లిక్‌గా వచ్చి మాట్లాడతారని నేను భావించడం లేదు. ఎందుకంటే అది వారి వ్యక్తిగత విషయం'' అని ఫాతిమా సనా షేక్ తెలిపారు.

    ఆ విషయాలు షేర్ చేసుకోవడం ఇష్టం లేదు

    ఆ విషయాలు షేర్ చేసుకోవడం ఇష్టం లేదు

    ఫాతిమా సనా షేక్ గతంలో కూడా పలు సందర్బాల్లో తనకు లైంగిక వేధింపులు ఎదురైనట్లు తెలిపారు. అయితే ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు, సదరు వ్యక్తి గురించి డీటేల్స్ కానీ పంచుకోవడం తనకు ఇష్టం ఉండదని, అది నా వ్యక్తిగతమని స్పష్టం చేశారు.

    ఫాతిమా సనా ఖాన్

    ఫాతిమా సనా ఖాన్

    అమీర్ ఖాన్ ‘దంగల్' ద్వారా ఫాతిమా సనా షేక్ మెయిన్ స్ట్రీమ్ నటిగా బాలీవుడ్లో అడుగు పెట్టారు. అయితే అంతకంటే ముందే ఆమె 1997లో వచ్చిన ‘చాచి 420' అనే చిత్రంలో బాలనటిగా చేశారు. ‘దంగల్' విజయం తర్వాత అమీర్ ఖాన్ మూవీ ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్'లో కూడా ఆమె నటించినప్పటికీ అది బాక్సాఫీసు వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే.

    English summary
    In an interview with India Today, Fatima said that sexual harassment is not restricted to just Bollywood, and she faced it a long time ago. ‘‘It happened when I was very young. I think people assuming that it's very current and wondering why I am not talking about it. that's a lot of expectation. Every woman in our country has dealt with it and I'm sure not everyone wants to talk about it publicly," she said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X