హీరోని ఆ ప్లేస్‌లో తాకుతూ.. లైవ్‌లో దొరికిపోయిన దంగల్ నటి.. ఏకీపారేస్తోన్న నెటిజన్లు
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన వారు చిత్ర పరిశ్రమలో ఎందరో ఉన్నారు. ఈ కోవలోకే వస్తారు ఫాతిమా సనా షేక్. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్‌కు కూతురిగా దంగల్ చిత్రంలో నటించి భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. దాదాపు 2 వేల కోట్లకు పైగా వసూళ్లతో దంగల్ ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా విజయంలో ఫాతిమాది కూడా కీలకపాత్రే. అయితే గత కొద్దిరోజులుగా సినిమాల కంటే వివాదాలతోనే ఈ ముద్దుగుమ్మ వార్తల్లో నిలుస్తోంది.
దంగల్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా
జమ్మకాశ్మీకర్‌కు చెందిన ఫాతిమా షేక్.. 1997లో ఇష్క్ సినిమాలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నువ్వు నేను ఒక్కటవుదాం అనే తెలుగు సినిమాతో టాలీవుడ్‌ను పలకరించారు. ఈ దశలో దంగల్ చిత్రం ఫాతిమా కెరీర్‌ను మార్చేసింది. ఈ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారినప్పటికీ ఆ క్రేజ్‌ను ఆమె సద్వినియోగం చేసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. నెమ్మదిగా సినిమాలు చేస్తూ వస్తున్నారు ఫాతిమా. రెండేళ్ల క్రితం ధక్ ధక్, సామ్ బహదూర్‌లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం మెట్రో ఇన్ దినో, గుస్తాఖ్ ఇష్క్, ఆప్ జైసా కోయి అనే సినిమాల్లో నటిస్తున్నారు ఫాతిమా.

అమీర్‌తో ఎఫైర్ అంటై ప్రచారం
కిరణ్ రావుకు అమీర్‌ఖాన్ విడాకులు ఇవ్వడంతో ఆయనపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఫాతిమాతో అమీర్ డేటింగ్ చేస్తున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. వీటిని వీరిద్దరూ ఖండించారు. దంగల్ సినిమా సమయంలో తాను మూర్చ వ్యాధితో బాధపడినట్లు ఫాతిమా తెలిపారు. మందులు, వ్యాయామం ద్వారా రికవరీ అయినట్లు ఆమె వెల్లడించారు. నీరసం, అలసట కారణంగా తన రోజువారీ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపిందని ఫాతిమా ఆవేదన వ్యక్తం చేశారు. నటీనటులు, దర్శకులకు కూడా తన ఆరోగ్య పరిస్ధితిని వివరించానని.. ప్రతి ప్రాజెక్ట్‌కు అగ్రిమెంట్ కుదుర్చుకునే సమయంలోనే నిర్మాతలకు తన అనారోగ్యం గురించి తెలియజేస్తానని ఫాతిమా తెలిపారు.
క్యాస్టింగ్ కౌచ్‌పై వ్యాఖ్యలు
ఇటీవల చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఫాతిమా. దక్షిణాదిలో ఓ సినిమా చేస్తున్నప్పుడు ఓ ఏజెంట్ నా దగ్గరికొచ్చి సినిమా కోసం అన్నింటికీ సిద్ధంగా ఉండాలని డబుల్ మీనింగ్‌తో మాట్లాడాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన కొందరు నిర్మాతలు హీరోయిన్లను కమిట్‌మెంట్ అడుగుతారని వివాదానికి తెరదీసింది. ఈ వ్యాఖ్యలతో దక్షిణాదికి చెందిన సినీ అభిమానులు మండిపడ్డారు. సౌత్ ఇండస్ట్రీని కించపరిచేలా మాట్లాడావంటూ ట్రోలింగ్‌కు దిగారు. దీనిపై ఫాతిమా స్పందించారు.. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని.. దక్షిణాది మొత్తాన్ని తాను కించపరచలేదని క్లారిటీ ఇచ్చారు.
హీరోని అసభ్యంగా తాకుతూ
ఇదిలాఉండగా.. ఫాతిమా షేక్‌కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ సినిమా ఈవెంట్‌కు నటీనటులతో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా నటుడు అలీ ఫజల్‌కు క్లోజ్‌గా ఉంటూ తన ఛాతి భాగాన్ని అతనికి తగిలేలా చేసింది. ఫజల్ కాస్త ఇబ్బంది పడుతూ పక్కకి జరిగే ప్రయత్నం చేయగా.. ఫాతిమా మాత్రం అతనితో పాటు పక్కకి జరుగుతూ తన ఎద భాగంతో అతనిని టచ్ చేస్తూనే ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఫాతిమా షేక్ తీరుపై మండిపడుతున్నారు. మరి దీనిపై దంగల్ నటి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











