ఆ సినిమా కోసం సాయి పల్లవికి భారీ రెమ్యునరేషన్..?
ఫిదా సినిమాతో పవర్ఫుల్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి క్రేజ్ అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఎదో ఒక పాయింట్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. సాయి పల్లవి ఒక కథ సెలక్ట్ చేసుకుందంటే షూటింగ్ మొదలైన రోజు నుంచే అంచనాల డోస్ పెరుగుతోంది.
ఇక MCA సినిమాలో నానితో కలిసి నటించిన సాయి పల్లవి కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచే ఈ బ్యూటీ మెల్లమెల్లగా తన రెమ్యునరేషన్ ని పెంచుకుంటూ వెళుతోంది. ఇక రీసెంట్ గా నానితో మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. టాక్సీ వాలా దర్శకుడు రాహుల్ డైరెక్ట్ చేయనున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో నానికి జోడిగా నటించడానికి సాయి పల్లవికి భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారట.

దాదాపు హీరోకి సమానంగా ఉండే ఆ పాత్రలో కొంచెం నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయట. ఇక ఆ పాత్ర కోసం అమ్మడికి రూ.2కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు టాక్ వస్తోంది. అప్పటివరకు సాయి పల్లవి ఈ రేంజ్ లో పారితోషికాన్ని అందుకోలేదు. అప్పుడు ఎంసీఏ సినిమాతో ఎలాగైతే రేటు పెరిగిందో ఇప్పుడు మళ్ళీ నాని సినిమా ద్వారానే రేటు పెరుగుతోంది.
చూస్తుంటే భవిష్యత్తులో ఈ నెంబర్ ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సాయి పల్లవి చేతిలో ప్రస్తుతం మంచి సినిమాలే ఉన్నాయి. శేఖర్ కమ్ముల లవ్ స్టొరీ, విరాటపర్వం వంటి డిఫరెంట్ సినిమాలతో పాటు మెగాస్టార్ వేదళం రీమేక్ లో ఆమె సిస్టర్ పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











