మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఫిదా బ్యూటీ.. మళ్ళీ ఆ హీరోతోనే..?
ఫిదా సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మలయాళం బ్యూటీ సాయి పల్లవి. ఒకే ఒక్క సినిమాతో తన క్రేజ్ ని అమాంతంగా పెంచుకున్న సాయి పల్లవి ఆ తరువాత తమిళ్ తెలుగు అని తేడా లేకుండా చాలా సినిమాల్లో నటించింది. అయితే సాయి పల్లవి ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఎదో ఒక స్పెషల్ ఉంటుంది. అలాగే పాత్ర కూడా చాలా కొత్తగా ఉండేలా జాగ్రత్త పడుతుంది.
అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఫిదా సినిమాతో సక్సెస్ అయితే అందుకుంది గాని ఆ సక్సెస్ ని మాత్రం ఈ బ్యూటీ ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేకపోతోంది. అయినప్పటికీ అవకాశాలు రావడం తగ్గడం లేదు. ఇక నెక్స్ట్ నాని సినిమాలో కూడా ఒక ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే వీరి కాంబినేషన్ లో MCA అనే సినిమా వచ్చింది. అయితే ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు.

ఇక నెక్స్ట్ ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని సాయి పల్లవి కొత్త తరహా కథలను ఎంచుకుంటోంది. టాక్సివాలా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేయబోతున్నాడు నాని. అయితే ఆ సినిమాలో ఇప్పటివరకు చాలా మంది హీరోలను అనుకున్నారు. కానీ ఎవరు సెట్ కాకపోవడంతో ఫైనల్ గా సాయి పల్లవిని ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది.


Click it and Unblock the Notifications











