ఫైనల్ గా తెలుగులో ఓ సినిమాతో కీర్తి సురేష్.. సెన్సేషనల్ హీరోతో రొమాన్స్ కి ఓకే చెప్పిందా?
తెలుగు సినిమా దగ్గర కెరీర్ స్టార్ట్ చేసిన మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న హీరోయిన్స్ చాలా ముందే కనిపిస్తారు కానీ ఆ తర్వాత సర్వైవ్ అయ్యి కొనసాగిన వారు మాత్రం చాలా తక్కువే ఉంటారని చెప్పవచ్చు. ఇలా తెలుగులో ఒక హోమ్లీ డెబ్యూ ఇచ్చిన హీరోయిన్స్ లో నటి కీర్తి సురేష్ కూడా ఒకామె అని చెప్పవచ్చు. కాగా కీర్తి సురేష్ హీరోయిన్ తెలుగులో "నేను శైలజ" సినిమాతో ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకుంది. అక్కడ నుంచి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా అందుకుంది.
కాగా అక్కడ నుంచి తెలుగులో ఆనతి కాలం లోనే భారీ హిట్స్ అందుకున్న కీర్తి కొన్నాళ్ళకి ఫేడ్ అవుట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇలా తన లుక్స్ కూడా మార్చుకున్నప్పటికీ వరుస ప్లాప్ లేదా డిజాస్టర్స్ మాత్రమే ఆమె నుంచి రావడంతో నెమ్మదిగా తెలుగులో సినిమాలు తన నుంచి తగ్గిపోయాయి. లాస్ట్ గా హీరోయిన్ గా అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట తర్వాత మళ్ళీ ఏ బిగ్ స్టార్ హీరో సినిమాలో కూడా కనిపించలేదు.

కాకపోతే నానితో దసరా సినిమాలో మెరిసింది. ఇంకోపక్క తమిళ్ సినిమాలు కూడా డిజాస్టర్స్ అవుతుండడంతో కీర్తి పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇక దెబ్బకి హిందీ సినిమాలోకి బేబీ జాన్ అంటూ ఎప్పుడు లేని విధంగా హాట్ షో చేసి ఎంట్రీ ఇచ్చింది. కానీ అక్కడ కూడా ఎదురు దెబ్బ తప్పలేదు. ఇలా తెలుగు, తమిళ్ సహా హిందీ భాషలో మొత్తం పాన్ ఇండియా లెవెల్లో కీర్తి సురేష్ కి ఒక్క హిట్ ఈ మూడేళ్ళలో దక్కలేదు.
కానీ మధ్యలో హీరోయిన్ గా చేయకపోయినప్పటికీ తెలుగు సినిమా కల్కి 2898 ఎడి లో బుజ్జి రోబోట్ కి డబ్బింగ్ చెప్పి హైలైట్ అయ్యింది. కాగా అక్కడ నుంచి మళ్ళీ తెలుగులో ఎలాంటి అలికిడి లేదు కానీ ఇపుడు ఫైనల్ గా కీర్తి సురేష్ కి ఓ సాలిడ్ ఆఫర్ వచ్చినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఈ రూమర్స్ ప్రకారం ఈమె నెక్స్ట్ సినిమాగా సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయనుంది అని వినిపిస్తోంది.
కాగా విజయ్ దేవరకొండ ఇపుడు గౌతమ్ తిన్ననూరితో భారీ సినిమా కింగ్డమ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత రవికిరణ్ కోళ (రాజా వారు రాణి గారూ) ఫేమ్ దర్శకుడుతో చేయనున్న సినిమాలో కీర్తి ఇపుడు హీరోయిన్ గా ఫైనల్ అయినట్టుగా తెలుస్తుంది. కాగా ఈ సినిమా మంచి రా అండ్ రస్టిక్ గా ప్లాన్ చేస్తుండగా కీర్తి సురేష్ రోల్ కూడా మంచి నాటు గానే ఉంటుంది అని వినిపిస్తుంది.
మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న రౌడీ జనార్ధన్ సినిమాలో కీర్తి సురేష్ ఎలాంటి ట్రీట్ ని తన నుంచి అందిస్తుందో వేచి చూడాలి మరి. కాగా ఈ సినిమా కాకుండా బాలీవుడ్ లో కూడా పలు సినిమా ఆఫర్లు కీర్తి సురేష్ కి వస్తున్నట్టుగా మరిన్ని రూమర్స్ ఉన్నాయి. మరి వేచి చూడాలి మహానటి మంచి కంబ్యాక్ ఎపుడు ఇస్తుందో ఏంటో అనేది.


Click it and Unblock the Notifications











