twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిక్కుల్లో క్వీన్... కంగనపై FIR

    |

    మాటల తూటాలతోనే బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న కంగనారనౌత్... పెద్ద స్టార్స్ పైనా విమర్శలు ఎక్కుపెట్టేందుకు వెనుకాడదు. దీంతో పాటే ఆమెకు మిత్రులకన్నా శత్రువులే ఎక్కువ అనడంలో సందేహమేలేదు. సుశాంత్ సింగ్ మరణం తర్వాత నెపోటిజం పై కంగనా ఘాటుగా స్పందిస్తూ, డ్రగ్ మాఫియా పైనా సంచలన వ్యాఖ్యలుచేసింది.

    తాజాగా క్వీన్ చిక్కుల్లో పడింది. ఆమెపై కర్నాటక పోలీసులు ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేశారు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్నవారిని ఉగ్రవాదులుగా ఆరోపిస్తూ ఆమె ట్వీట్ చేసింది. దీంతో ఆమెపై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ నాయక్ అనే వ్యక్తి తుమకూరు కోర్టులో పిటిషన్ వేశారు.అక్టోబర్ 5 వతేదీన తీర్పును రిజర్వ్ లో పెట్టిన కోర్టు ఇవాళ ఆదేశాలిచ్చింది.

    FIR Filed Against Kangana Ranaut

    అయితే తాను జస్ట్ సారీ చెబుతానని కంగనా చెప్పడంతో అన్నదాతలు మరింత మండిపడుతున్నారు.సీఏఏ ను వ్యతిరేకించినవారు, ఈ నిరసనకారులు కూడా టెర్రరిస్టులతో సమానమే అని కంగనా ఆ మధ్య తీవ్రంగా విమర్శించింది.

    కంగనా చేసిన ట్వీట్లు భిన్న భావజాలం కలిగిన రెండు గ్రూపుల మధ్య చిచ్చు రేపే అవకాశం ఉందని.. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు కూడా ఈ ట్వీట్లను చూసీ చూడనట్లే వదిలేసినట్లు కనిపిస్తోందని పిటీషన్ పేర్కొన్నారు. చూడలి మరి జరుగుతుందో.

    English summary
    An FIR has been registered against actor Kangana Ranaut over her tweets against farmers, following the orders of a court in Tumakuru district of Karnataka directing the same.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X