రకుల్ ప్రీత్ సింగ్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో..

మొన్నటి వరకూ టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో తన స్థాయిని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇటీవల హఠాత్తుగా రకుల్ ప్రీత్ సింగ్ నివాసముంటున్న అపార్ట్ మెంట్ లో ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది. ముంబైలోని ఒక ఖరీదైన అపార్ట్మెంట్ లో ఉంటున్న రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలని చూస్తోంది. అయితే ఇంతలో ఆమె ఉంటున్న అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం మీడియాలో కూడా వైరల్ గా మారింది.

 12వ అంతస్థులో ప్రమాదం

12వ అంతస్థులో ప్రమాదం

ముంబైలోని నటి రకుల్ ప్రీత్ సింగ్ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్‌లోని 12వ అంతస్తులో ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం అయితే జరగలేదని తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో రకుల్ కూడా తన ఫ్లాట్ లేదట.

అగ్ని జ్వాలలు చెలరేగడంతో

అగ్ని జ్వాలలు చెలరేగడంతో

ఒక్కసారిగా 12వ అంతస్థులో అగ్ని జ్వాలలు చెలరేగడంతో వెంటనే అక్కడికి అగ్నిమాపక దళంతో పాటు అంబులెన్స్ కూడా ప్రమాదం స్థలానికి చేరుకుంది. ఇక అగ్నిప్రమాదానికి గల కారణాలు అయితే తెలియరాలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చుకునేందుకు అగ్నిమాపక దళంతో పాటు అంబులెన్స్‌ను రంగంలోకి దించడంతో పెద్దగా ప్రమాదం ఏమి చోటు చేసుకోలేదు. ఎవరు కూడా గాయపడలేదని తెలుస్తోంది.

9 సినిమాలతో బిజీగా..

9 సినిమాలతో బిజీగా..

రకుల్ కూడా ఈ ప్రమాదంపై ఇంతవరకు స్పందించలేదు. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. తెలుగు, తమిళం మరియు బాలీవుడ్‌లో దాదాపు 9 ప్రాజెక్ట్‌లతో బిజీగా గడుపుతోంది. హిందీలో, ఆమె ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా యొక్క డాక్టర్ జి, సినిమాతో పాటు జాన్ అబ్రహం యొక్క ఎటాక్ సినిమాలో కూడా మేయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక అజయ్ దేవగన్ యొక్క మేడే సినిమాలో కూడా రకుల్ కీలక పాత్రలో నటిస్తోంది.

తెలుగులో డిజాస్టర్స్

తెలుగులో డిజాస్టర్స్

అక్షయ్ కుమార్‌తో కూడా సైకలాజికల్ థ్రిల్లర్‌లో నటించడానికి ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రకుల్ తమిళంలో శివకార్తికేయన్ తో కూడా ఒక లక్కీ ఛాన్స్ అందుకుంది. అయాలన్ మరియు కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమాలు కూడా రకుల్ చేతిలో ఉన్నాయి. ఇక తెలుగులో అయితే రకుల్ ఇటీవల వరుస డిజాస్టర్స్ ఎదురవ్వడంతో పెద్ద హీరోలతో అవకాశం అందుకోవడం లేదు. చివరగా నితిన్ తో చెక్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

Recommended Video

Bigg Boss Telugu 5 : VJ Sunny Elimination | అనీ మాస్టర్‌ ఎలిమినేట్ పక్కా || Filmibeat Telugu
 త్వరలోనే పెళ్లి

త్వరలోనే పెళ్లి

ఇక రకుల్ ప్రీత్ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఇటీవల బాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా సింగిల్ గాన్స్ ఉన్నట్లు తన ప్రేమ విషయాన్ని గోప్యంగా ఉంచిన రకుల్ మొత్తానికి పెళ్లి విషయంలో కూడా ఒక హింట్ ఇచ్చేసింది. 2022లో ఈ ఇద్దరు పెద్దల సమక్షంలో సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X