ధైర్యవంతురాలే: హీరోయిన్ కాజల్ అగర్వాల్ అగ్ని విన్యాసాలు!
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తాజాగా తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఓ వీడియో అభిమానులను, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో కాజల్ అగ్నితో విన్యాసాలు చేస్తూ కనిపించారు. ఇది చూసిన ఫ్యాన్స్ కాజల్ ధైర్యవంతురాలే అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు.
ఈ వీడియోలో కాజల్ అందంగా ముస్తాబయి ఉండటం, వెనక డాన్సర్లు ఉండటాన్ని బట్టి .. ఆమె నటిస్తున్న మూవీ సాంగ్ షూట్లో ఈ అగ్ని విన్యాసాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఏ మూవీ సెట్ అనేది ఆమె వెల్లడించలేదు. తమిళ మూవీ 'కోమలి' షూటింగ్ స్పాట్ అని తెలుస్తోంది.
కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి 'సీత' అనే చిత్రంలో నటిస్తోంది. తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదలయ్యే అవకాశం ఉంది. గతేడాది కాజల్ బెల్లంకొండతో 'కవచం' సినిమా చేసిన సంగతి తెలిసిందే.

మరో వైపు తమిళంలో ఆమె కోమలి, పారిస్ పారిస్ అనే రెండు చిత్రాల్లో నటిస్తోంది. 2017లో వచ్చిన మెర్సల్ తర్వాత కాజల్ తమిళ చిత్రాల్లో కనిపించలేదు. దాదాపు రెండేళ్ల తర్వాత జయంరవి మూవీ 'కోమలి', హిందీ 'క్వీన్' రీమేక్ 'పారిస్ పారిస్' ద్వారా తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











