పెళ్లి తర్వాత విజయ్‌కు తొలి ముద్దు.. ఫస్ట్ హగ్ ట్రెండింగ్.. (Wedding Photos)
నేషనల్ క్రష్ రష్మిక మందన్న, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అనేక రూమర్లు, ఊహాగానాలకు తెర దించుతూ దంపతులుగా ఒక్కటయ్యారు. గత ఏడేళ్లకుపైగా అతి సన్నిహితంగా, అన్యోన్యంగా డేటింగ్ చేస్తున్న ఈ స్టార్ జంట ఇరు కుటుంబాలు, స్నేహితులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల సమక్షంలో వేద బ్రాహ్మణుల మత్రోచ్ఛారణల మధ్య ఏడుడుగులు నడిచారు. దాంతో వారి ప్రేమకథ ఇప్పుడు కుటుంబ కథగా మారింది. అయితే అత్యంత ప్రైవేట్ కార్యక్రమంగా తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను మీడియాకు షేర్ చేశారు. ఆ ఫోటోలు ప్రస్తుతం మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. విజయ్‌కు రష్మిక ఇచ్చిన తొలి ముద్దు, ఫస్ట్ హగ్ క్రేజీగా మారాయి. ఈ స్టార్ కపుల్ పెళ్లికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ప్రముఖ ప్రైవేట్ హోటల్‌లో ప్రైవేట్ ఫ్యామిలీ అఫైర్‌గా సాగిన ఈ కల్యాణానికి ఇరు కుటుంబాలకు చెందిన 200 మంది హాజరయ్యారు. ఫిబ్రవరి 26వ తేదీన ఉదయం 10.10 నిమిషాల ముహుర్తానికి రష్మిక మెడలో విజయ్ మూడుమూళ్లు వేసి జీవిత భాగస్వామిగా చేసుకొన్నారు. ఏడడుగులతో జీవిత ప్రయాణాన్ని ప్రారంభించారు.

విజయ్, రష్మిక వివాహానికి తెలుగు సినిమా రంగం నుంచి దర్శకులు తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా, శివ నిర్వాణ, హీరోయిన్ ఇషా రెబ్బా హాజరయ్యారు. ఇంకా పలువురు సినీ ప్రముఖులు కూడా పాలుపంచుకొన్నట్టు తెలుస్తున్నది.
అయితే తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను మీడియాకు షేర్ చేసుకొన్నారు. అయితే పెళ్లిలో ఇద్దరి మూమెంట్స్ బ్యూటీఫుల్‌గా ఉండటం అందర్నీ ఆకర్షించాయి. ఈ ఫోటోలను పలు మీడియా సంస్థలు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేస్తూ ట్రెండింగ్‌కు తెర లేపారు.
అయితే పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండకు రష్మిక ఇచ్చిన తొలి ముద్దు, అలాగే ప్రేమతో ఇచ్చిన కౌగిలింత ఆకట్టుకొంటున్నది. అలాగే బిందెలో ఉంగరం వేసి వెతికే ఆటకు సంబంధించిన ఫోటోలు లైవ్లీగా ఉన్నాయి. అలాగే వివాహ వేడుకలో ఇద్దరి హావభావాలు, సంతోషంలో మునిగిన క్షణాలు అభిమానులను ఆకట్టుకొంటున్నాయి.


Click it and Unblock the Notifications











