కూతురుకు దీపిక పదుకోన్ అలాంటి పేరు పెట్టిందేమిటి? తొలిసారి ఫోటోను షేర్ చేసిన రణ్‌వీర్ సింగ్
బాలీవుడ్‌లో స్టార్ హీరో, హీరోయిన్లు దీపిక పదుకోన్, రణ్‌వీర్ సింగ్ తమ అభిమానులకు దీపావళీ సందర్భంగా శుభవార్తను అందించారు. ఎంతో కాలంగా ఊరిస్తున్న తన కూతురు ఫోటోను, పేరును ప్రపంచానికి పరిచయం చేశారు. కూతురు ఫోటోను షేర్ చేయగా అభిమానులు ఫిదా అయిపోయారు. అయితే ఈ స్టార్ కపుల్ తమ బేటీకి ఏం పేరు పెట్టారు? ఫోటోతో వారు చేసిన చమక్కు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..
దీపిక పదుకోన్, రణ్ వీర్ సింగ్ ప్రేమ కథ విషయానికి వస్తే.. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన రామ్ లీలా అనే చిత్రం షూటింగులో జరిగిన పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరూ కలిసి చాలా ఏళ్లు డేటింగ్ చేశారు. అనంతరం ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం చేసుకొన్నారు. వారి వివాహం కొంకణి, సిక్కు మతాచారాల ప్రకారం 2018 సంవత్సరంలో ఇటలీలోని లేక్ కామోలో జరిగింది.

గత ఆరేళ్లుగా సాగుతున్న వైవాహిక జీవితాన్ని ఇద్దరు సెలబ్రిటీలు ఎంజాయ్ చేస్తున్నారు. కలిసి నటించడమే కాకుండా వారిద్దరి సినీ నిర్మాణం, అలాగే బిజినెస్ ఏర్పాటు, మోడలింగ్ తదితర అంశాల్లో బిజీగా మారిపోయారు. అలా సాగుతున్న లైఫ్‌లోకి కూతురు ప్రవేశించింది. తొలి సంతానంతో ఇద్దరి ప్రయాణం మరింత సంతోషంగా మారింది.
దీపిక, రణ్‌వీర్ దంపతులకు 2024 సెప్టెంబర్ 8వ తేదీన తొలి సంతానం కలిగింది. అప్పటి నుంచి తమ కూతురును చూపించమని అభిమానులు వెంటపడుతున్నారు. అలాగే చిన్నారి పేరు ఏంటి అంటూ సోషల్ మీడియాలో కోరుతున్నారు. అయితే దీపావళీ పండగ శుభవేళ తన అభిమానులకు కూతురు ఫోటోను, అలాగే పేరును కూడా రివీల్ చేశారు.
తన కూతురు పేరు దువా పడుకోన్ సింగ్ అని నామకరణం చేశాం. దువా అంటే హిందీలో ప్రార్థన అని తెలిపింది. అలాగే తన ఇంటి పేరు పడుకోన్, రణ్ వీర్ సింగ్ పేరులోని సింగ్‌ను చిన్నారి పేరుకు చేర్చింది. తన కూతురు పేరు అలా పెట్టడానికి కారణాన్ని వెల్లడిస్తూ.. మా ప్రార్థనలకు సమాధానమే నా కూతురు. ఆమె జన్మించిన తర్వాత మా హృదయాలు ప్రేమతో ఉప్పొంగిపోయాయి అని వారిద్దరూ ఇన్స్‌టాగ్రామ్‌లో ద్వారా వెల్లడించారు. చిన్నారి పాదాలను మాత్రమే చూపించి.. ముఖాన్ని ఇంకా దాచిపెట్టారు. దాంతో అభిమానులు వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
దీపిక పదుకోన్, రణ్‌వీర్ సింగ్ కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా వారిద్దరూ కలిసి నటించిన సింగమ్ అగైన్ చిత్రం దీపావళీ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2024 సంవత్సరంలో ఫైటర్, కల్కి 2898 ఏడీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాలు అందుకొన్నారు. రణ్ వీర్ సింగ్ విషయానికి వస్తే.. రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని, సింగమ్ అగైన్ సినిమాల్లో నటించారు. ధురంధర్ అనే సినిమా రిలీజ్‌కు ముస్తాబవుతున్నది.


Click it and Unblock the Notifications











