భర్తకు హ్యాండించి పరిణితి హానిమూన్‌ ట్రిప్..పెళ్లి తర్వాత మాల్దీవుల వేకేషన్‌కు ఎవరితో వెళ్లిందో తెలుసా?

బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా తన కెరీర్, సినిమా విషయాల కంటే.. ఇతర విషయాలతోనే మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించకపోయినా స్టార్ హీరోయిన్‌గా చెలామణి అయింది. సినిమాలతో బిజీగా ఉంటూనే.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో అఫైర్ నడిపింది. మీడియాలో వారిద్దరి డేటింగ్ వ్యవహారంపై రచ్చ జరుగుతుండగానే దానికి తెర దించుతూ పెళ్లికార్డు వేశారు. అయితే పరిణితి చోప్రా పెళ్లి తర్వాత మరోసారి మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ హాట్ వార్త వివరాల్లోకి వెళితే..

ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో కొన్ని నెలల డేటింగ్ జోరుగా నడిపిన తర్వాత పరిణితి చోప్రా పెళ్లికి సిద్దమయ్యారు. సెప్టెంబర్ 24వ తేదీన రాజస్థాన్‌లో రాచరిక సంప్రదాయాలతో వివాహం చేసుకొన్నారు. వీరిద్దరి వివాహానికి మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ పెళ్లికి సినీ, రాజకీయ వర్గాలు హాజరయ్యారు. ఈ ఇద్దరి వివాహం విందు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ముగిసాయి.

Parineeti chopra Raghav Chadha Wedding

రాఘవ చద్దాతో వివాహం తర్వాత పరిణితి చోప్రా తన హానీమూన్‌ను ఘనంగా జరుపుకొంటుందని అనుకొన్నారు. అయితే అందుకు భిన్నంగా హానీమూన్ ప్లాన్ లేకుండా ఒంటరిగా మాల్దీవులకు వెకేషన్‌కు వెళ్లింది. మాల్దీవుల్లో విహారయాత్రను ఎంజాయ్ చేస్తూ ఫోటోలను షేర్ చేసింది. దాంతో భర్తతో కాకుండా మరొకరితో విహారయాత్రకు వెళ్లిన విషయం బయటపెట్టింది.

అయితే పరిణితి చోప్రా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ బికినీలో ఫోటోను రిలీజ్ చేసింది. స్విమ్మింగ్ ఫూల్‌లో దిగి ఎంజాయ్ చేస్తూ ఫోటోకు ఫోజిచ్చింది. ఆ ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేయగా నెటిజన్లు ఘాటుగా కామెంట్లు చేశారు. హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నావా? .. పెళ్లి తర్వాత హానీమూన్‌కు వెళ్లావా అని కామెంట్లతో హోరెత్తించారు.

Parineeti Chopra Poses for magazine
First Photo of Parineeti chopra photo after marriage with Raghav Chadha in instagram goes viral

నెటిజన్ల కామెంట్లకు పరిణితి చోప్రా బదులిస్తూ.. నేను హానిమూన్‌కు వెళ్లలేదు. నా ఫోటోను నా భర్త తీయలేదు. ఈ ఫోటోను నా మరదలు తీసింది. మాల్దీవులకు అమ్మాయిలం అంతా కలిసి వెళ్లాం. ఇది గర్ల్స్ ట్రిప్. హానిమూన్ కానే కాదు అని పరిణితి చెప్పింది. దాంతో హానీమూన్ ఎందుకు క్యాన్సిల్ అయింది అంటూ నెటిజన్లు కామెంట్ పెట్టారు. అయితే పరిణితి బికినిలో షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతున్నది.

రాఘవ్ చద్దాతో పెళ్లి తర్వాత తన ఇన్స్‌టాగ్రామ్‌లో తొలి ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోకి ఇన్స్‌టాగ్రామ్‌లో మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఈ ఫోటోకు 1.5 లక్షల లైక్స్‌ వచ్చాయి. వేల కొద్ది నేను కామెంట్స్ వచ్చాయి. అయితే పెళ్లి తర్వాత భర్తతో కాకుండా మరదలితో హానిమూన్‌కు వెళ్లడం ఏమిటి అని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X