సమంత రెండో పెళ్లి.. రాజ్ నిడిమోరుతో మ్యారేజ్ ఫోటో షేర్ చేసి.. (Photos)
సినిమా పరిశ్రమలో అగ్ర నటి సమంత రుత్ ప్రభు తన డేటింగ్ లైఫ్‌పై వస్తున్న రూమర్లకు తెరదించారు. గత కొద్దికాలంగా సన్నిహితంగా బంధాన్ని కొనసాగిస్తున్న ది ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఆమె వివాహం చేసుకొని అనేక రూమర్లకు ముగింపు పలికారు. అతి తక్కువ మంది స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరూ పెళ్లి చేసుకొన్నారు. వీరి వివాహ వేడుకకు కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్ వేదికగా మారింది. అయితే తమ పెళ్లి వార్తలపై ఇద్దరు సెలబ్రిటీలు కూడా ఇప్పటి వరకు పెదవి విప్పకపోవడంతో అభిమానుల ఆసక్తి రెండింతలైంది. సమంత రెండో పెళ్లికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
సమంత తొలి వివాహం నాగ చైతన్య అక్కినేనితో జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారిద్దరి కాపురం సవ్వంగానే సాగింది. అంతా బాగానే ఉందనే క్రమంలో సమంత, చైతు ఇద్దరూ 2022 అక్టోబర్ 2వ తేదీన తమ తమ ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ల ద్వారా తాము విడిపోతున్నట్టు ప్రకటించారు. ఇద్దరం ఇష్టపూర్వకంగానే విడిపోయాం. మా ప్రైవసీకి భంగం కలిగించకూడదు అని తమ ప్రకటనలో వేడుకొన్నారు.

నాగచైతన్యతో విడిపోయిన తర్వాత అనారోగ్యానికి గురైన ఆమె కొద్దికాలం విశ్రాంతి తీసుకొన్నారు. ఆ తర్వాత రాజ్ నిడిమోరుతో పరిచయం ప్రేమగా మారడం, ఆ తర్వాత వారిద్దరూ డేటింగ్ చేస్తూ పలుచోట్ల కనిపించడంతో ఇద్దరి మధ్య ఏదో రిలేషన్‌షిప్ ఉందనే విషయం స్పష్టమైంది. కానీ వారిద్దరూ ఏనాడు తమ బంధంపై అధికారికంగా మాట చెప్పపోవడంతో ఊహగానాలు భారీగా ప్రచారమయ్యాయి. ఇటీవల కాలంలో రాజ్ నిడిమోరుతో కలిసి దిగిన ఫోటోను సమంత షేర్ చేయగా.. వారిద్దరి స్టేటస్ తెలిసి పోయింది.
ఆదివారం సాయంత్రం నుంచే సమంత పెళ్లి వార్త మీడియాలో వైరల్ అవుతూ వచ్చింది. ఈ వార్తల నేపథ్యంలో సమంత కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌కు చేరుకొన్నారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల సభ్యులు అక్కడి చేరుకొని ఏర్పాట్లను వేగవంతం చేశారు. తాజా సమాచారం ప్రకారం ఇషా యోగా సెంటర్‌లోని లింగ్ భైరవి ఆలయంలో జరిగింది. డిసెంబర్ 1 తేదీ ఉదయం సమంత మెడలో రాజ్ మూడు మూళ్లు వేశాడు అనే విషయాన్ని ఫౌండేషన్ నిర్వాహకులు, సన్నిహితులు తెలిపారు.
సమంత, రాజ్ నిడిమోరు పెళ్లికి కొద్దిమంది స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దాదాపు 30 మంది సమక్షంలో వారి వివాహం జరిగింది. తమ పెళ్లికి సంబంధించిన విషయాన్ని సోమవారం మధ్యాహ్నం తర్వాత ఎప్పుడైనా తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది.
ఇక సమంత తొలి భర్త నాగచైతన్య ఇటీవల హీరోయిన్ శోభిత ధూళిపాలను వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వివాహం చేసుకొన్న రాజ్‌కు శ్యామలి డే అనే భార్య ఉంది. కొంతకాలంగా వారిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఇటీవల వారిద్దరి పెళ్లి గురించి రాజ్ భార్య నర్మగర్భంగా ట్వీట్లు చేస్తూ లీకులు ఇవ్వడం తెలిసిందే.


Click it and Unblock the Notifications











