హీరోయిన్‌ను దారుణంగా కొట్టిన నిర్మాత (షాకింగ్ ఫోటోస్)
హీరోయిన్ ఆశా షైనీ గుర్తుందా? తెలుగులో ప్రేమ కోసం, అంతా మనమంచికే, అమ్మో ఒకటో తారీఖు లాంటి చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన ఈ నార్త్ బ్యూటీ... బాలయ్య 'నరసింహ నాయుడు' సినిమాలో లక్స్ పాప సాంగుతో పాపులర్ అయింది. తెలుగులో దాదాపు 25 సినిమాలకుపైగా నటించిన తర్వాత ఇక్కడ అవకాశాలు లేక పోవడంతో బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. తన పేరు కూడా ఫ్లోరా షైనీ అని మార్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్లో #మీటూ ఉద్యమం జోరందుకున్న నేపథ్యంలో తాను ఎదుర్కొన్న హరాస్మెంట్ గురించి, తనపై జరిగిన దాడి గురించి గుర్తు చేసుకున్నారు.

దారుణంగా కొట్టాడు
ఫేస్ బుక్ పేజీ ద్వారా తనపై జరిగిన దాడి గురించి ఫ్లోరా షైనీ వెల్లడించారు. నిర్మాత గౌరంగ్ దోషి తనపై చేయి చేసుకున్నాడు, తీవ్రంగా కొట్టాడంటూ ఫోటోలతో సహా పోస్టు చేశారు. ఇందులో ఆమె ముఖం మీద తీవ్ర గాయాలైనట్లు కనిపిస్తోంది.

ప్రేమికుల దినోత్సవం రోజే..
2007లో ప్రేమికుల దినోత్సవం రోజున ఈ దాడి జరిగింది. ఆ సమయంలో నేను గౌరంగ్ దోషితో ప్రేమలో ఉన్నట్లు ఆశా షైనీ తెలిపారు. ఆ తర్వాత సంవత్సరం పాటు అతడు నరయాతనకు గురి చేశాడని, అప్పుడు అతడికి ఉన్న పలుకుబడి కారణంగా నన్ను ఎవరూ పట్టించుకోలేదు అని ఫ్లోరా షైనీ వెల్లడించారు.

నాలాగే ఎందరో ఆడ పిల్లలు అతడి వల్ల కష్టాలు పడ్డారు
గౌరంగ్ దోషి వల్ల నాలాగే ఎందరో ఆడపిల్లలు కష్టాలు పడ్డారు. ఆ సమయంలో కొందరు నన్ను సహాయం కోరాని ఏమీ చేయలేక పోయాను. నన్ను బెదిరించాడు. తన పవర్ ఉపయోగించి ఇండస్ట్రీలో లేకుండా చేస్తానంటూ భయపెట్టాడు అని ఫ్లోరా షైనీ గుర్తు చేసుకున్నారు.

ఇపుడు బయట పెట్టడానికి కారణం
కొన్ని రోజులుగా బాలీవుడ్లో #మీటూ ఉద్యమం ఊపందుకుంది. పలువురు నటీమణులు తమకు జరిగిన వేధింపుల గురించి బయట పెడుతున్నారు. వారికి మద్దతు తెలుపుతూ ... అపుడు నేను ఇలాంటి ధైర్యం చేయలేక పోయాను అని ఫ్లోరా షైనీ తెలిపారు.

నా జీవితంలో రిపేరు చేయలేని మార్పులు
ఆ సంఘటన తర్వాత నేను వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా చాలా నష్టపోయాను. చాలా సినిమాల్లో నేను ఫైనల్ అయిన తర్వాత నన్ను తీసేని వేరే వారిని పెట్టుకున్నారు. నా జీవితంలో సరిదిద్దుకోలేని మార్పులు జరిగాయి... అని ఫ్లోరా షైనీ అన్నారు.
నిజాన్ని నమ్ముకోండి
నిజాన్ని నమ్ముకుని దాన్ని ఆయుధంలా ధరించి ముందుకు సాగండి. ఆ దేవుడు అన్నీచూస్తున్నాడు. మీరు అనుకున్నది జరుగుతుంది. మనం ధైర్యంగా ఎదరించినపుడే సంతోషంగా ఉండగలం అని ఫ్లోరా షైనా తనలాంటి బాధితులకు ఉపదేశించారు.


Click it and Unblock the Notifications











