టాప్ లెస్ గా షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. బాధలు ఉన్నాయని చెబుతూనే దారుణమైన పిక్!
ప్రస్తుతం ఇండియాలో టాలీవుడ్ రెండో స్థానంలో ఉంది. ముందు బాలీవుడ్ ఉందన్నమాటే కానీ అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాలు అయితే తెలుగువే. అందుకే బాలీవుడ్ లో మెరవాలనుకున్న భామలు కూడా ఎక్కువగా తెలుగు సినిమాల మీద ఫోకస్ పెడుతూ ఉంటారు. అందులో భాగంగానే చాలా మంది నార్త్ భామలు కూడా తెలుగులో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ బాలీవుడ్ కి వెళ్లి సత్తా చాటిన దాఖలాలు ఉన్నాయి. అలాగే ఎంట్రీ ఇచ్చిన ఒక నార్త్ భామ ఇప్పుడు అసలు ఏమాత్రం అవకాశాలు లేక బోల్డ్ వెబ్ సిరీస్ ల బాట పట్టింది. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన ఒక బోల్డ్ ఫోటో సంచలనంగా మారింది. ఆ వివరాలు

కోల్‌కతాకు తరలివెళ్లి
చండీగఢ్‌లో ఆర్మీ అధికారికి జన్మించిన ఫ్లోరా జమ్మూ కాశ్మీర్‌లోని ఉదంపూర్‌లో పాఠశాల విద్య సాగించింది. తరువాత ఆమె తన తన విద్యను ఢిల్లీలోని ధౌలా కువాన్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో కొనసాగించింది. అయితే తండ్రి ఉద్యోగ రీత్యా ఆ తరువాత కుటుంబం అంతా కోల్‌కతాకు తరలివెళ్లింది, అక్కడ ఆమె మోడలింగ్ వృత్తిని ఎంచుకుని, గ్లామర్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఆమె మిస్ కోల్‌కతా అందాల పోటీలో పాల్గొంది.

తెలుగు సినిమాతో హీరోయిన్ గా
ఆ తర్వాత ఫ్లోరా 1999లో విడుదలైన ప్రేమ కోసం అనే తెలుగు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ చిత్ర నిర్మాత ఆమెకు ఆశా సైని అని పేరు పెట్టారు; కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె ఒక జ్యోతిష్యుని సలహా మేరకు మయూరి అనే కొత్త స్క్రీన్ పేరును పెట్టుకుంది. కానీ అది కూడా కలిసి రాకపోవడంతో, చివరికి ఆమె అసలు పేరు తిరిగి పెట్టుకుంది. అలా ఆమె రకరకాల పేర్లతో చెలామణీ అయింది.

ఒక్కసారిగా మలుపు తిరిగి
నటి ఫ్లోరా సైనీ తెలుగులో దాదాపు 30కి పైగా సినిమాల్లో సెకండ్ హీరోయిన్ సహా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటించింది. కానీ పూర్తి స్థాయిలో హీరోయిన్ గా మాత్రం నిలదొక్కుకోలేక పోయింది. కాగా ఈ అమ్మడు తెలుగులో ప్రముఖ దర్శకుడు కె విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించి చేసింది చిన్న రోల్ అయినా అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రం మంచి హిట్ అవడంతో ఈ అమ్మడి సినీ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.

చిక్కులు కూడా
ఆలాగే ఫ్లోరా సైని టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నటిగా నిలదొక్కుకుంటున్న సమయంలో బాలీవుడ్ పై మనస్సు పారేసుకుంది. ఈ క్రమంలో ఒకటి, రెండు హిందీ చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకున్నప్పటికీ ఈ చిత్రాలు కాస్త డిజాస్టర్ కావడంతో ఈ అమ్మడి వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఇటు టాలీవుడ్ లో కూడా ఫ్లోరా శైనికి ఆఫర్లు రాకపోవడంతో ఆ మధ్య కొన్ని బోల్డ్ కంటెంట్ వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. రాజ్ కుంద్రా అరెస్ట్ అయినప్పుడు ఈ విషయంలో ఆమె కొన్ని చిక్కులు కూడా ఎదుర్కొంది.

ఎక్స్ క్లూజివ్ కంటెంట్
అయితే ఈ మధ్య కాలంలో నటి ఫ్లోరా సైనీ సినిమా ఆఫర్ల కోసం బాగానే కష్ట పడుతున్నట్టుంది. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు పలు రకాల హాట్ ఫోటో షూట్లు, బికినీ షూట్లు అంటూ అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది. కాగా తాజాగా ఈ అమ్మడు తన పేరు మీద సొంత యాప్ ఓపెన్ చేసి మరీ తన ఎక్స్ క్లూజివ్ కంటెంట్ కావలనంటే ఆ యాప్ లో డబ్బు కట్టి జాయిన్ అవ్వాలంటూ కవ్విస్తోంది. అదలా ఉంచితే ఇప్పుడు తాజాగా ఆమె టాప్ బ్యాక్ లెస్ ఫోటో షేర్ చేసి రచ్చ రేపింది.
Recommended Video

అన్నీ వదిలేసి
అనేక సమస్యలతో బాధపడిన విషయాన్ని చెబుతూనే ఆమె తన హాట్ ఫోటోను వదిలింది. ఆమె సమస్యలు గురించి చదివిన నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. అయితే ఆ పోస్ట్ కు ఆమె హాట్ ఫోటో కేవలం అటెన్షన్ కోసమే పెట్టిందని అనుకోవచ్చు. అయితే ఆమె పోస్ట్ ను చదవడమే కాక ఆ హాట్ ఫోటోను చూసి కామెంట్లు చేస్తున్నారు. ఆమె వదిలిన ఫొటోలో కేవలం ఒక వస్త్రాన్ని అడ్డుగా కప్పుకుంది. వీపు భాగం అంతా అలాగే వదిలివేయడమే కాక కిందకూడా ఏమీ లేదని అనుమానం కలిగేలా ఉంచింది.


Click it and Unblock the Notifications











