అందుకే పవన్ కళ్యాణ్, నాని సినిమాలు రిజెక్ట్ చేశా.. ఫోక్ బ్యూటీ నాగదుర్గ కామెంట్స్ వైరల్!

ఫోక్ బ్యూటీ నాగదుర్గ.. పల్లె పాటలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనాలేని క్రేజ్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో కోట్లాది వ్యూస్ సాధించిన ఫోక్ పాటలతో యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నది ఈ అందాల భామ. కాపోళ్ల ఇంటికాడ, ఎర్ర ఎర్రని రుమాలు గట్టి, తిన్న తిరం పడ్తలే, దారి పొంటొత్తుండు, జిల్లెలమ్మ జిట్ట, పేరు గళ్ల పెద్ది రెడ్డి వంటి ఫోక్ సాంగ్స్‌తో నాగదుర్గ యూట్యూబ్ సెన్సేషన్‌గా మారింది. ఆమె పాటలకంటే వాటిలో వేసే ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్పులకే ప్రత్యేక అభిమానులు ఉన్నారు. అందుకే నాగదుర్గ నుంచి కొత్త పాట వస్తుందంటే చాలు.. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లోకి వెళ్లిపోతుంది.

ఫోక్ సాంగ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ భామ ఇప్పుడు పూర్తి స్థాయి కథానాయికగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బలగం ఫేమ్ ప్రియదర్శి హీరోగా నటిస్తున్న 'ఇడుపు కాగితం' సినిమాలో ఆమె పూర్తి స్థాయి హీరోయిన్‌గా కనిపించనుంది. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు వర్క్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమాలో నాగదుర్గ 'శ్రీలత' అనే తెలంగాణ పల్లెటూరి యువతి పాత్రలో నటిస్తోంది. ఫోక్ సింగర్‌గా, డాన్సర్‌గా ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ.. ఇప్పుడు వెండితెరపై హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

Folk Dancer Naga Durga Reveals Why She Turned Down Pawan Kalyan and Nani Movie Offers

నాగదుర్గ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, మిస్ అయిన అవకాశాలు, సక్సెస్ సీక్రెట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. నాగదుర్గ మాట్లాడుతూ.. "యూట్యూబ్ పాటల వల్ల నాకు ఊహించని స్థాయిలో గుర్తింపు వచ్చింది. నేను కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి వరుసగా పాటల్లో అవకాశాలు వచ్చాయి. నేను చేసిన దాదాపు ప్రతి పాట మిలియన్ల వ్యూస్ సాధించింది. ప్రేక్షకులు చూపించిన ప్రేమ వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను. అందుకే ఇప్పుడు హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమానే నా కెరీర్‌కు సరైన డెబ్యూ మూవీ అని అనిపించింది. కథ వినగానే ఇది నాకు బాగా సెట్ అవుతుందని భావించి వెంటనే అంగీకరించాను' అని చెప్పింది.

ఇక సినిమాల్లో వచ్చిన అవకాశాల గురించి మాట్లాడుతూ.. 'హీరోయిన్‌గా నటించకముందే చాలా మంచి ఆఫర్లు వచ్చాయి. నాని హీరోగా నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో సాయి పల్లవి పాత్రకు సహచరిగా క్లాసికల్ టచ్ ఉన్న ఓ ముఖ్యమైన పాత్ర కోసం నన్ను సంప్రదించారు. అలాగే 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమాలో కూడా అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో' సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ కోసం కూడా అడిగారు. సినిమాలతో పాటు పలు టెలివిజన్ సీరియల్స్‌లో నటించే అవకాశాలు కూడా వచ్చాయి' అని వెల్లడించింది.

అయితే ఆ అవకాశాలన్నింటినీ వదులుకోవడానికి కారణమేమిటంటే ..ఆ సమయంలో నా ఫోకస్ పూర్తిగా నాట్యంపైనే ఉండేది. ముఖ్యంగా కూచిపూడి నృత్యంలో డాక్టరేట్ సాధించాలనేది నా కల. అందుకే సినిమాల్లోకి వెంటనే రావాలని అనుకోలేదు. నాట్య సాధనకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చిన ఆఫర్లను వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం మంచి కథ, మంచి పాత్ర దొరికిందని భావించి సినిమాల్లోకి అడుగుపెట్టాను' అని తెలిపింది.

తన పాటలు యూట్యూబ్‌లో కోట్లాది వ్యూస్ సాధించడానికి కారణం ఏమిటని అడగగా నాగదుర్గ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. 'దాంట్లో ఎలాంటి మేజిక్ లేదు. నన్ను ఏ నిర్మాత పాట కోసం సంప్రదించినా ముందుగా ఆ కాన్సెప్ట్‌పై చర్చిస్తాను. ప్రేక్షకులకు ప్రతి పాటలో కొత్తగా కనిపించాలని ప్రయత్నిస్తాను. డ్యాన్స్ స్టెప్పుల నుంచి కాస్ట్యూమ్స్, మేకప్, డ్రెస్సింగ్ వరకు ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను. ప్రతి పాటలో ఏదో ఒక కొత్తదనం ఉండాలని కోరుకుంటాను. ప్రతి స్టెప్‌ను ప్రాణం పెట్టి చేస్తాను. అదే ప్రేక్షకులకు నచ్చి ఉండొచ్చు. అందుకే నా పాటలకు మిలియన్ల వ్యూస్ వస్తున్నాయని నేను భావిస్తున్నాను'అని చెప్పింది.

ప్రస్తుతం నాగదుర్గ ప్రియదర్శి హీరోగా నటిస్తున్న 'ఇడుపు కాగితం' సినిమాలో పూర్తి స్థాయి హీరోయిన్‌గా నటిస్తోంది. ఫోక్ డాన్సర్‌గా, సోషల్ మీడియా స్టార్‌గా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఇప్పుడు హీరోయిన్‌గా కూడా అదే స్థాయిలో విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.

Read more about: priyadarshi nani pawan kalyan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X