twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైఎస్ జగన్ గురించి మాజీ తెలుగు హీరోయిన్, మహరాష్ట్ర ఎంపీ నవనీత్ కౌర్ కామెంట్

    |

    తెలుగులో హీరోయిన్‌గా రాణించిన నవనీత్ కౌర్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా గెలుపొందిన సంగతి తెలిసిందే. నవనీత్ కౌర్‌ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు రవి రాణాను 2011లో ప్రేమ వివాహం చేసుకున్నారు. రవి రాణా బద్నేరా నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. భర్త ద్వారా రాజకీయ పాఠాలు నేర్చుకున్న నవనీత్ కౌర్.... గత ఐదేళ్లుగా రాజకీయాల్లో చుకురుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ఇపుడు ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టారు.

    మహారాష్ట్ర అంటే ఇష్టం.. కానీ తెలుగు రాష్ట్రాలు అంటే నాకు ప్రాణం

    మహారాష్ట్ర అంటే ఇష్టం.. కానీ తెలుగు రాష్ట్రాలు అంటే నాకు ప్రాణం

    తాజాగా పార్లమెంట్ వద్ద తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నవనీత్ కౌర్ మాట్లాడుతూ... నాకు మహారాష్ట్ర అంటే ఇష్టం.. కానీ తెలుగు రాష్ట్రాలు అంటే నాకు ప్రాణం. ఎందుకంటే నేను నా కెరీర్ మొదలు పెట్టింది అక్కడే. నేనెవరో ప్రపంచానికి తెలియడానికి కారణం తెలుగు సినిమా. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరించారు. నాకు ఫేమ్ ఇచ్చారు, స్టేటస్ ఇచ్చారని తెలిపారు.

    యోగా శిబిరంలో రవి రాణాతో పరిచయం

    యోగా శిబిరంలో రవి రాణాతో పరిచయం

    మాది ఆర్మీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. 8వ తరగతిలోనే సరదాగా సినిమాల్లో నటించాను. అదే నా కెరీర్ అయింది. పదేళ్లు ఇండస్ట్రీలో పని చేసిన తర్వాత స్వామి రాందేవ్ మహరాజ్ యోగా శిబిరంలో నా భర్త రవి రాణాతో పరిచయం ఏర్పడింది. ఇద్దరం స్నేహితులం అయ్యాం. ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.

    నా భర్తను చూసి రాజకీయాల్లోకి..

    నా భర్తను చూసి రాజకీయాల్లోకి..

    మ్యారీడ్ లైఫ్, పొలిటికల్ లైఫ్ పూర్తిగా డిఫరెంట్. రవి రాణా నా జీవితంలోకి రావడానికి ముందు నాకు రాజకీయాలు అంటే ఏమిటో తెలియదు. ఆయన్ను కలిసిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత రాజకీయాల మీద అవగాహన వచ్చింది. పేద ప్రజల కోసం నా భర్త రోజూ 16 గంటలు పని చేస్తున్నపుడు నేను కూడా పేద ప్రజలు, స్టూడెంట్స్, రైతుల కోసం ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ సమయంలోనే ప్రజలు కూడా నన్ను రాజకీయాల్లో రావాలని డిమాండ్ చేశారు.

    నా ఫోటోలతో తప్పుడు ప్రచారం చేసి ఓడించారు

    నా ఫోటోలతో తప్పుడు ప్రచారం చేసి ఓడించారు

    2014లో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాను. ఆ సమయంలో ఓ పెద్ద లీడర్ మీద పోటీ చేశాను. ఆయన 7 సార్లు ఎంపీ. ఆ సమయంలో నా ఫోటోలు అసభ్యంగా చిత్రీకరించి జనాలకు వాట్సాప్ చేయడం, సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసి మీకు ఇలాంటి ఎంపీ కావాలా? అంటూ తప్పుడు ప్రచారం చేశారు. అందుకే ఓడిపోయాను. వారు చేసిన పనికి నేను ఏ మాత్రం కృంగిపోలేదు. ఎందుకంటే నేను మొదటి నుంచి ఇండిపెండెంట్ అండ్ స్ట్రాంగ్ ఉమెన్.

    ఓడినా కష్టపడి పని చేశాను

    ఓడినా కష్టపడి పని చేశాను

    రాజకీయాల్లోకి వచ్చినపుడు భర్త సపోర్ట్ ఉంది, నాలో కాన్ఫిడెన్స్ ఉంది. అయితే నాపై తప్పుడు ప్రచారం చేసి ఓడిపోయేలా చేశారు. అయినా ఏ మాత్రం తగ్గకుండా 2014 నుంచి ఇప్పటి వరకు రోజూ 16 గంటలు ప్రజల కోసం పని చేశాను. నా పని తీరు చూసి అమరావతి(మహారాష్ట్ర) పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలు నేను ఇండిపెండెంట్ అభ్యర్థి అయినప్పటికీ ఎంపీగా గెలిపించారు.

    ఆంధ్రా నుంచి నాకు జగన్మోహన్ రెడ్డి ఇన్స్‌స్పిరేషన్

    ఆంధ్రా నుంచి నాకు జగన్మోహన్ రెడ్డి ఇన్స్‌స్పిరేషన్

    ఆంధ్రా నుంచి నాకు జగన్మోహన్ రెడ్డి ఇన్స్‌స్పిరేషన్. ఆయన్ను ఫాలో అవుతుంటాను. ప్రజలతో ఎలా మమేకం అవ్వడం అనేది నేర్చుకున్నాను. ఆంధ్రా, తెలంగాణ గురించి ఏమైన సమస్యలు లోక్ సభలో లేవనెత్తితే తప్పకుండా నా మద్దతు ఇస్తాను అని నవనీత్ కౌర్ తెలిపారు.

    English summary
    Former actress and MP Navneet Kaur about Telugu states. Navaneet Kaur is an Indian film actress who mainly acts in Telugu films. She is elected as Member of Parliament from Amravati constituency in 2019 Loksabha election as independent candidate.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X