పొట్టకూటి కోసం భిక్షాటన... కంటతడి పెట్టిస్తోన్న హీరోయిన్ దుస్థితి

రంగుల ప్రపంచం లాంటి చిత్ర పరిశ్రమలో ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. సూపర్‌స్టార్లుగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించి.. విలాసవంతమైన జీవితం అనుభవించిన వారు చివరి రోజుల్లో తిండి కూడా లేక దయనీయ స్థితిలో మరణించిన ఉదంతాలెన్నో. మహానటి సావిత్రి, కాంతారావు, చిత్తూరు నాగయ్య, రాజనాల ఇలా మన టాలీవుడ్‌లోనే ఎంతోమంది తెరవేల్పులు ఎలా జీవితాన్ని సాగించారో అందరికీ తెలిసిందే. తాజాగా తిరుగులేని అందంతో కుర్రాళ్ల గుండెల్లో కలల రాకుమారిగా నిలిచిన ఓ హీరోయిన్ ప్రస్తుతం దిక్కుతోచని స్ధితిలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆ నటి ఎవరు? ఆమె జీవితం ఇలా ఎందుకైంది? ఈ వివరాల్లోకి వెళితే..

సినీ పరిశ్రమలో స్టార్లుగా వెలుగొందిన కొందరు తర్వాత అవకాశాలు లేక సామాన్య జీవితం గడిపారు. చిన్నా చితకా ఉద్యోగాలు, పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటూ వచ్చారు. పావలా శ్యామల, తన కుమార్తెతో కలిసి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో దాతలు, ప్రజల సాయంపై రోజులు గడుపుతున్నారు. తమిళ నటి పాకీజా సైతం ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టీవీలు, వార్తాపత్రికల ద్వారా విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆమెకు ఆర్ధిక సాయం అందించిన సంగతి తెలిసిందే. ఇలాంటి వారు సినీ రంగంలో అడుగడుగునా కనిపిస్తారు.

Former Actress Mitali Sharma Found Begging on Mumbai Streets Shocking Photos Go Viral

ఈ కోవలోకే వస్తుంది మితాలీ శర్మ జీవితం. మోడల్‌గా రాణించి ఆపై సినీరంగంలో అడుగుపెట్టిన ఆమె నటిగా ఎదిగింది. ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ.. చిన్నప్పటి నుంచి సినీరంగంపై ఇష్టంతో ఎలాగైనా పరిశ్రమలో ఎదగాలని కలలు కనింది. ఈ క్రమంలోనే ఢిల్లీ నుంచి తన మకాంను ముంబైకి మార్చింది. మోడల్‌గా అవకాశాలు అందుకున్న మితాలీ పలు బ్రాండ్స్‌కి చెందిన వాణిజ్య ప్రకటనల్లో నటించింది. అనంతరం భోజ్‌పురి పరిశ్రమ నుంచి కబురు రావడంతో అక్కడ కొన్ని సినిమాల్లో నటించింది మితాలీ.

డబ్బు, పేరుకు తోడు తన అందంతో మంచి అవకాశాలు అందుకుంది మితాలీ. అయితే అంతలోనే పరిస్థితులు తారుమారు అయ్యాయి. సినిమాలు, మోడలింగ్‌లో కాంట్రాక్ట్‌లు ఇచ్చేవారు కరువయ్యాయి. ఎంతగా ప్రయత్నించినా అవకాశాలు దక్కలేదు. సినిమాల్లోకి వెళ్లడానికి కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకం కావడంతో ఫ్యామిలీ సపోర్ట్ లేక అటు అవకాశాలు లేక, ఆర్ధిక సమస్యలతో మితాలీ శర్మ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆమె ఏమైపోయిందోనని అభిమానులు టెన్షన్ పడ్డారు.

బక్కచిక్కిన శరీరంతో, కళ తప్పిన ముఖంతో ముంబై వీధుల్లో భిక్షాటన చేస్తున్న ఓ మహిళ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆమెను గుర్తుపట్టిన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో పొట్టకూటి కోసం నగరంలోని లోఖండ్ వాలా వీధుల్లో భిక్షాటన చేస్తున్నారు మితాలీ. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. మితాలీ ఆచూకీ కనిపెట్టి ఆమెను రక్షించారు. అనంతరం ఆహారం, అవసరమైన చికిత్స అందించారు. మానసిక పరిస్ధితి క్షీణించడంతో మితాలీని ఓ మానసిక ఆరోగ్య కేంద్రంలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మితాలీకి దుస్థితికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలోనూ చిత్ర పరిశ్రమలోనూ వైరల్ అవుతున్నాయి. సినీరంగంలో పైకి కనిపించే గ్లామర్ వెనుక చీకట్లు కూడా ఉంటాయని.. సరైన ప్రణాళిక, అదృష్టం కలిసిరాకపోతే పాతాళంలో చిక్కుకుపోతారని మితాలీ వంటి తారల జీవితాలు తెలియజేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X