38 ఏళ్ల వయసులో నాలుగో బిడ్డకు జన్మినిచ్చిన హీరోయిన్.. సూపర్ హీరోయిన్ బిడ్డ పేరేంటో తెలుసా?
హాలీవుడ్‌లో యాక్షన్ హీరోయిన్ గాల్ గ్యాడట్ తన అభిమానులకు శుభవార్తను అందించింది. ఈ అందాల భామ తాజాగా నాలుగో బిడ్డకు జన్మనిచ్చింది. మార్చి 6వ తేదీన తన భర్త జారోన్ వార్సానో ఈ వార్తను మీడియాకు అందించారు. దాంతో ఈ బ్యూటీకి సినీ అభిమానులు, సన్నిహితులు, తోటి నటీనటులు సెలబ్రిటీ దంపతులకు శుభాకాంక్షలు అందించారు. వెండితెరపై పవర్ ఫుల్ లేడికి సంబంధించిన నాలుగో ప్రసవం, ఆమె వ్యక్తిగత జీవితం వివరాల్లోకి వెళితే..
ప్రపంచ సినిమాలో తనకంటూ సూపర్ ఉమెన్ ఇమేజ్ సంపాదించుకొన్న గాల్ గ్యాడట్.. తాను ఇష్టపడి ప్రేమించిన జారోన్ వార్సానోను 2008 సంవత్సరంలో వివాహం చేసుకొన్నారు. అప్పటి నుంచి వారిద్దరు ముగ్గురు పిల్లలకు జన్మినిచ్చారు. తన మొదటి కూతురు ఆల్మా వయసు 12, మాయా వయసు 6, డెనీయెలా వయసు 2 సంవత్సరాలు.

తాజాగా తన 38 వయసులో నాలుగో బిడ్డకు జన్మినిచ్చారు. ఆ ముద్దుల చిన్నారి పేరును ఓరిగా నామకరణం చేశారు. ఈ భూప్రపంచంపైకి మా అందాల చిన్నికూతురు స్వీటి అడుగుపెట్టింది అంటూ ఓ మెసేజ్ పెట్టి.. హాస్పిటల్ బెడ్‌పై నుంచే తన కూతురి ఫోటోను అభిమానులతో పంచుకొన్నది. ప్రస్తుతం గాల్ గ్యాడట్ నాలుగో బిడ్డ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
తన నాలుగో కూతురు గురించి తమ భావోద్వేగాన్ని వెల్లడిస్తూ.. మా జీవితంలోకి కొత్త వెలుగు తీసుకొచ్చావు. నీవు నీ పెరుగు తగినట్టే లైఫ్‌లో వెలుగులు చిమ్మాలి అని ఆకాంక్షించారు. ఓరి (Ori) అంటే హెబ్రూ భాషలో నా క్రాంతి అని అర్ధం.

గాల్ గ్యాడట్ విషయానికి వస్తే.. ఆమె తన ప్రెగ్నెన్సీ విషయాన్ని గుట్టుగా ఉంచారు. బార్బీ ప్రీమియర్ సందర్భంగా మీడియా కంటపడ్డారు. ఆ సమయంలో తన గర్బాన్ని కవర్ చేస్తూ జాగ్రత్తగా పడ్డారు. దాంతో పెద్దగా మీడియాకు ఆ విషయం తెలియదు. తాజాగా ఏకంగా నాలుగో బిడ్డకు జన్మినిచ్చామని చెబుతూ.. సర్‌ప్రైజ్ ఇచ్చారు.
గాల్ గ్యాడట్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాతో 2009 సంవత్సరంలో సినిమా రంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత వంబర్ ఉమెన్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకొన్నారు. తన కెరీర్‌లో 20కిపైగా సినిమాల్లో నటించారు. తాజాగా ఆమె నటించిన హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో ఆలియా భట్ కూడా నటించిన విషయం తెలిసిందే. ఆమె నటించిన స్నో వైట్, ఇన్ ది హ్యాండ్ ఆఫ్ డాంటే సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











