Kiara Advani: బేబి బంప్‌తో గేమ్ చేంజర్ భామ? ప్రెగ్నెన్సీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన నార్త్ బ్యూటిల్లో కియారా అద్వానీ ఒకరు. సూపర్ స్టార్ మహేశ్​ బాబుకు జోడిగా భరత్​ అనే నేను సినిమాలో నటించిన కియరా అద్వానీ తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం దక్షిణ, హిందీ చిత్రాల్లో అవకాశాలు కొల్లగొడుతూ దూసుకుపోతున్న ఈ బ్యూటి బాలీవుడ్​లో గోల్డెన్​ లెగ్​గా అనిపించుకుంటుంది. తెలుగులో గేమ్ చేంజర్ సినిమా ద్వారా మరోసారి చెర్రీతో జోడి కట్టనున్న ఈ భామ ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె ప్రెగ్నెన్సీపై చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి.

మిడిల్ క్లాస్: తెలుగులో మంచి క్రేజ్ సంపాందించుకున్న హిందీ హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. వారిలో గ్లామరస్ సుందరి కియారా అద్వానీ ఒకరు. భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ సినిమాలో ఓ మధ్య తరగతి అమ్మాయిగా తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రేమించే ఓ సాధారణ మధ్య తరగతి యువతిగా అలరించింది.

 Kiara Advani

బోల్తా కొట్టిన మూవీ:హిందీ భామ కియారా అద్వానీ భరత్ అనే నేను సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్​ చరణ్​తో వినయ విధేయ రామ చిత్రంలో నటించింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గ్లామర్ డోస్ పెంచింది. అయితే కుటుంబ నేపథ్యం, యాక్షన్ అండ్ సెంటిమెంట్ గా వచ్చిన వినయ విధేయ రామ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

అన్నీ హిట్లే:వినయ విధేయ రామ తర్వాత వరుసగా హిందీ సినిమాలు చేస్తూ వచ్చింది కియారా అద్వాని. వాటిలో కబీర్ సింగ్, గుడ్ న్యూస్, కళంక్, షేర్షా, లక్ష్మీ, గిల్టీ, అంగ్రేజీ మీడియం, భూల్ భులయ్యా 2 వంటి సినిమాలతో ఆకట్టుకుంది. ఈ సినిమాల్లో సుమారుగా అన్ని చిత్రాలు విజయం సాధించడంతోపాటు కియారా గ్లామర్ కి నార్త్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి.

Kiara Advani:

పాస్ట్-ప్రజంట్ సినిమాలు: గతేడాది గోవిందా నామ్ మేరా సినిమాతో నేరుగా ఓటీటీ ప్రేక్షకులు ముందుకు వచ్చింది బ్యూటిఫుల్ కియారా అద్వాని. అలాగే కార్తీక్ ఆర్యన్ తో కలిసి సత్య ప్రేమ్ కి కథ అనే మరో మూవీతో అలరించింది ఈ చిన్నది. ఇది పర్వాలేదనిపించుకుంది. రామ్ చరణ్ తో మరోసారి గేమ్ చేంజర్ సినిమా కోసం జత కట్టింది కియారా అద్వానీ. ఇదే కాకుండా వార్ 2లో కూడా నటిస్తోంది.

బేబి బంప్ పిక్స్: ఇక ఇటీవలే తన ప్రియుడు, హీరో సిద్దార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకుంది కియారా అద్వానీ. సినీ సెలబ్రిటీల సమక్షంలో ఫిబ్రవరి 7న రాజస్థాన్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే గత నెలలో కియారా పొట్ట కాస్తా పెద్దదిగా (బేబి బంప్ వలే) కనిపించింది. దీంతో ఆమె ప్రెగ్నెంటా అని నెటిజన్లు సందేహం తెలుపుతూ కామెంట్స్ చేశారు. అనంతరం మళ్లీ నాజుకుగా కనిపించేసరికి అదేం లేదని తేలిపోయింది.

Kiara Advani:

ప్రెగ్నెంట్ అవ్వాలని: ఇదిలా ఉంటే 2019లో వచ్చిన గుడ్ న్యూస్ మూవీ రిలీజ్ సమయంలో ప్రెగ్నెన్సీపై కియారా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. "నాకు ప్రెగ్నెంట్ కావాలనుంది. ఎందుకంటే ఆ సమయంలో నాకు నచ్చింది తినొచ్చు. అడ్డు చెప్పేవారే ఉండరు. నాకు పుట్టబోయే బిడ్డ ఆడ, మగ ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉంటే చాలు" అని చెప్పుకొచ్చింది. అయితే గుడ్ న్యూస్ మూవీ ప్రెగ్నెన్సీ స్టోరీపైనే ఉంటుంది. మరి కియారా పెగ్నెన్సీపై గుడ్ న్యూస్ ఏమైనా చెబుతుందేమో అని అభిమానులు ఆశపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X