శృంగార సన్నివేశాలకు ముందు.. అలా రిహార్సల్.. బోల్డ్ సీన్లపై అంజలి కామెంట్స్ వైరల్
ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా ఎంటర్టైన్మెంట్ రంగంలో అతి పెద్ద ఎంటర్టైన్మెంట్ సినిమాతో పాటుగా ఓటిటి కూడా గట్టి పోటీ ఇస్తుంది. అయితే బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ ని ఓటిటి బీట్ చెయ్యడం సాధ్యం కాదు కానీ ఓటిటి మూలాన నటీనటులకు అదనపు ఆదాయం దక్కే అవకాశం ఏర్పడింది అని చెప్పాలి. కాగా ఇలా వరల్డ్ వైడ్ గా అనేకమంది నటీనటులు బిగ్ స్క్రీన్స్ మీద పాపులర్ కాకపోయినప్పటికీ ఓటిటిలో మాత్రం బాగా షైన్ అవుతున్నారు.
అందుకే బిగ్ స్క్రీన్ పై మరీ అంత పాపులారిటీ లేని ఆర్టిస్ట్ లు ఓటిటిని మరో దారిగా వేసుకుంటున్నారు. కాగా ఇది మన ఇండియన్ సినిమా దగ్గర నటీనటులకు కూడా అతీతం కాదు. మన దగ్గర కూడా చాలా మంది నటీనటులు ఫేడ్ అవుట్ అవుతున్న వారు కూడా ఓటిటి వైపు వెళుతున్నారు. అయితే ఓటిటికి బిగ్ స్క్రీన్స్ పై ఉన్నట్టుగా పెద్ద రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఇది అందులో వీక్షకులకు పెద్ద ప్లస్ కావడంతో రీచ్ కూడా బాగుంటుంది.

అందుకే ఓటిటి మేకర్స్ బోల్డ్ అటెంప్ట్స్ చేస్తూ ఉంటారు. ఇలా ఎన్నో సిరీస్ లు ఒరిజినల్ సినిమాలు రాగా ఇటీవల తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చి అదరగొట్టిన సిరీస్ లలో అది కూడా మన తెలుగు సిరీస్ లలో అంజలి నటించిన బోల్డ్ అటెంప్ట్ సిరీస్ "బహిష్కరణ" కూడా ఒకటి. ఈ సిరీస్ లో అంజలితో పాటుగా తన వకీల్ సాబ్ కో నటి అనన్య నాగళ్ళ, నటుడు రవీంద్ర విజయ్ తదితరులు నటించారు.
అలాగే ఈ సిరీస్ ని ముకేశ్ ప్రజాపతి దర్శకత్వం వహించారు. అయితే ఈ సిరీస్ రిలీజ్ కి వచ్చిన తర్వాత మంచి టాక్ సొంతం చేసుకుంది. మెయిన్ గా ఇందులో అంజలి చేసిన బోల్డ్ సీన్స్ స్పెషల్ గా మారాయి. మరి సిరీస్ హిట్ కావడంతో మేకర్స్ ఒక ఫ్రెండ్లీ ప్రెస్ మీట్ పెట్టగా అందులో ఆమె చేసిన బోల్డ్ సీన్స్ పై ప్రశ్నకి అంజలి సమాధానం ఇచ్చింది. ఒక నటిగా నాకు మాత్రమే కాదు ఎవరికి ఐనా అది ఆడవాళ్ళూ అయినా మగవాళ్ళు అయినా ఇబ్బంది గానే ఫీల్ అవుతారు.

కానీ అక్కడ తన రోల్ పుష్ప కి ఇబ్బంది కాదు అలా అన్నట్టు సీన్స్ చేసేసాను అని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఇలాంటి సీన్స్ లో సినిమాకి వర్క్ చేస్తున్న అందరూ సెట్స్ లో ఉండకపోయినా కేవలం కొంతమంది అయినా ఉంటారు. వాళ్ళ ముందు అయినా అలంటి సీన్స్ చెయ్యక తప్పదు అని చెప్పింది. అలాగే ఈ ప్రశ్నపైనే సినిమా నటుడు రవీంద్ర విజయ్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.
మితిమీరిన శృంగారం తరహా సీన్స్ చేస్తున్నపుడు నటీనటులు మేము ముందే ఒక అండర్ స్టాండింగ్‌కి వస్తాం.. ముందే ఎవరు ఎంత దగ్గరకు ఉండాలి, ఎలాంటి భావోద్వేగాలు ఇవ్వాలి లాంటివి ప్రిపేర్ అయ్యి జాగ్రత్తలు తీసుకొనే చేస్తామని తెలిపారు. ముందు రిహార్సల్ చేసిన తర్వాత అసలు సీన్‌లోకి వెళ్తాం. ఇలాంటి కామెంట్స్ చేసిన రవీంద్ర, అంజలి మాటలు వైరల్ గా మారాయి. కాగా మరో పక్క అంజలి గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్, శంకర్ ల భారీ సినిమా గేమ్ ఛేంజర్ లో చరణ్ సరసన ఒక హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











