గణేష్ చతుర్థి వేడుకల్లో తప్పుగా ప్రవర్తించిన కత్రినా కైఫ్

గణేష్ చతుర్థి వేడుకలు గురువారం దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ముంబైలో సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ నివాసంలో జరిగిన గణేష్ చతుర్థి వేడుకల్లో సల్మాన్ ఖాన్‌తో పాటు కత్రినా కైఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కత్రినా కైఫ్ తప్పుగా ప్రవర్తించడం గమనించిన అభిమానులు ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు.

సల్మాన్ ఖాన్ బావ అతుల్ అగ్నిహోత్రి ఈ సందర్భంగా ఓ వీడియో అభిమానులతో పంచుకున్నారు. అందులో సల్మాన్ ఖాన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు గణేషుడికి హారతి ఇస్తూ కనిపించారు. అయితే కత్రినా కైఫ్ హారతి.... కుడిపైపు (క్లాక్ వైజ్) కాకుండా ఎడమవైపు (యాంటి క్లాక్ వైజ్) ఇవ్వడం గమనించిన ఫ్యాన్స్ హరతి ఇవ్వడం అలా కాదు, ఎవరైనా ఆమెకు చెప్పండి అంటూ విమర్శలు గుప్పించారు.

విదేశీయురాలు కావడం, ఇతర మతానికి చెందిన వ్యక్తి కావడం వల్లనే ఆమెకు ఈ ఆచారాలు తెలియక పోవచ్చు, ఆమె కావాలని చేసిన తప్పేం కాదు అని మరికొందు అభిప్రాయ పడ్డారు. ఈ కామెంట్స్ కత్రినా దృష్టికి వెళ్లే ఉంటాయి. ఇకపై ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తే ఇలాంటి పొరపాటు మళ్లీ చేయకుండా ఉంటుందేమో చూడాలి.

Ganesh Chaturthi: Katrina kaif doing the aarti the wrong way

సినిమా విషయానికొస్తే... ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న 'భారత్' మూవీలో కత్రినా నటిస్తోంది. ఇప్పికే మల్టాలో ఓ షెడ్యూల్ పూర్తయింది. వచ్చేవారం తర్వాతి షెడ్యూల్ అబు దుబాయ్‌లో ప్రారంభం కాబోతోంది. మరో వైపు ఆమె నటించిన 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' మూవీ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X