నాని హీరోయిన్.. మొత్తానికి పెద్ద హీరోనే పట్టేసింది
ఒక సినిమా హిట్టయితే హీరోయిన్స్ రేంజ్ ఎక్కడికో వెళుతుంది. ఒక వేళ సక్సెస్ రాకపోయినా కూడా హీరోయిన్స్ చాలా వరకు వారి టాలెంట్ తో లేదా అందంతో అవకాశాలు ఎక్కువగా అందుకుంటారు. అదే తరహాలో నాని హీరోయిన్ కు కూడా ఇండస్ట్రీలో బిజీగా మారుతోంది. ప్రియాంక అరుల్ మోహన్ గురించి అందరికి తెలిసే ఉంటుంది.
ఈ బ్యూటీ నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా కమర్షియల్ గా పెద్దగా హిట్ అవ్వకపోయినా కూడా అమ్మడి అందానికి మాత్రం మంచి క్రేజ్ దక్కింది. ఆ సినిమాలో ఆమె పెద్దగా హడావుడి చేసింది కూడా లేదు. జస్ట్ పక్కింటి అమ్మాయిలా నేచురల్ లుక్ తోనే అబ్బాయిలను అమితంగా ఆకట్టుకుంది. ఇక చాలా రోజుల తరువాత కోలీవుడ్ లో ఈ బ్యూటీకి ఒక మంచి ఆఫర్ వచ్చింది.

స్టార్ హీరో సూర్య సినిమాలో హీరోయిన్ పాత్రకు ఆమె సెట్టయినట్లు రూమర్స్ వస్తున్నాయి. పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో స్టార్ట్ కానుంది. ముందుగా చాలా మంది హీరోయిన్స్ ను అనుకున్నప్పటికి ఫైనల్ గా ప్రియాంకని అదృష్టం వరించినట్లు చెబుతున్నారు. ఇక తెలుగులో ఈ బ్యూటీ నెక్స్ట్ శర్వానంద్ శ్రీకారం సినిమాతో హిట్ కొట్టాలని చూస్తోంది.


Click it and Unblock the Notifications











