అల్లు అర్జున్ 'గంగోత్రి' చిన్నారి షాకింగ్ లుక్.. 18 ఏళ్ల తరువాత గ్లామరస్ హీరోయిన్‌గా..
కొన్ని సినిమాలు ఏళ్ళు గడిచినా కూడా అంత ఈజీగా ఎవరు మర్చిపోరు. ఇక మ్యూజికల్ హిట్స్ గా నిలిచిన సినిమాలు కూడా అంత ఈజీగా మాయమవ్వవు. అలాంటి బెస్ట్ సినిమాల్లో అల్లు అర్జున్ గంగోత్రి ఒకటి. ఈ సినిమా అప్పట్లో బెస్ట్ మ్యూజికల్ హిట్స్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో నటించిన చిన్నారి కావ్య అప్పట్లోనే మంచి క్రేజ్ అందుకుంది. ఇక 18 ఏళ్ళ అనంతరం ఆమెకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ దర్శకుడి 100వ చిత్రం
కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన 100వ చిత్రం గంగోత్రి. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని హీరోగా పరిచయం చేసిన ఆ సినిమా 2003లో మంచి హైప్ తో విడుదలయ్యింది. ఎమ్ఎమ్.కీరవాణి అందించిన మ్యూజిక్ సినిమాకు ఎంతగానో హెల్ప్ అయ్యింది. పాటలతో కూడా సినిమాను హిట్ చేయవచ్చని మరోసారి నిరూపించారు.

వల్లంకి పిట్ట అనే పాటతోనే
గంగోత్రి సినిమా అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ అదితి అగర్వాల్ కూడా వెండితెరకు పరిచయం అయ్యింది. అయితే వారితో పాటు చిన్నప్పటి హీరోయిన్ పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కావ్యాకు కూడా అప్పట్లో మంచి క్రేజ్ అందుకుంది. వల్లంకి పిట్ట అనే పాటతోనే ఆ చిన్నారి జనాలను అమితంగా ఆకట్టుకుంది.

18 ఏళ్ళ తరువాత.. గ్లామరస్ లుక్
ఆ పాట కారణంగా వల్లంకి పిట్ట చిన్నారిగా మారిపోయిన కావ్య ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన గ్లామరస్ ఫొటోలు బాగానే వైరల్ అవుతున్నాయి. సినిమా వచ్చి 18 ఏళ్ళు కావడంతో అభిమానులు ఆ సినిమా నటీనటుల ఫొటోలను బాగానే షేర్ చేస్తున్నారు. ఇక వల్లంకి పిట్ట కావ్య ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
Recommended Video

హీరోయిన్ గా ప్రయత్నాలు
గంగోత్రి సినిమా చేస్తున్నప్పుడు కావ్య వయసు 4ఏళ్ళు మాత్రమే. ఇక ఇప్పుడు 18ఏళ్ళు దాటడంతో ఆమె గ్లామరస్ హీరోయిన్స్ రేంజ్ లో ఫోటోలకు స్టిల్ ఇస్తున్నట్లు అనిపిస్తోంది. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కొంతమంది ఇప్పుడు హీరోయిన్స్ గా రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కావ్య కూడా హీరోయిన్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











