పైట తీసేసి రెచ్చిపోయిన టిల్లు హీరోయిన్.. సోకులన్నీ బయటపెట్టేసి మరీ!
టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా.. అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని.. వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో క్యూట్ హీరోయిన్ నేహా శెట్టి ఒకరు. చూపు తిప్పుకోకుండా చేసిన అందంతో పాటు అదిరిపోయే నటనతో మెప్పిస్తోన్న ఈ చిన్నది.. సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. ఇలా చేతి నిండా ఆఫర్లతో ముందుకు సాగుతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ నేహా శెట్టి హల్చల్ చేస్తోంది. ఇలా తాజాగా ఈ సుందరాంగి కొన్ని ఘాటు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరే లుక్కేయండి మరి!
కన్నడ నటి.. పూరీ మూవీ:కర్నాటకకు చెందిన నేహా శెట్టి ముందుగా మోడల్‌గా కెరీర్‌ను మొదలెట్టింది. అలా తనదైన అందాలతో మెప్పించడంతో ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే ఈ భామ 'ముంగారు మేల్ 2' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో ఒక్కసారిగా ఫుల్ ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే పూరీ ఆకాశ్ నటించిన 'మెహబూబా'తో తెలుగులోకి వచ్చింది.

ఆ సినిమాలతో.. రాధికగా:నేహా శెట్టికి ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా తెలుగులో ఆఫర్లు మాత్రం భారీ స్థాయిలోనే వెల్లువెత్తాయి. దీని తర్వాత నేహా శెట్టి 'గల్లీ రౌడీ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి చిత్రాల్లో కనిపించింది. వీటిలో మెప్పించడంతో ఆమెకు ఇంకా అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా 'డీజే టిల్లు' చిత్రంలో రాధిక అనే పాత్రతో నేహా శెట్టి సంచలనంగా మారిపోయింది.
ఈ మూవీలు.. హిట్ దిశ:టాలీవుడ్‌లో కొంత కాలంగా వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తోన్న నేహా శెట్టి.. 'డీజె టిల్లు' తర్వాత మరింతగా దూకుడును చూపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ కార్తికేయతో 'బెదురులంక 2012' అనే సినిమాతో వచ్చి హిట్ కొట్టింది. కానీ, కిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్' షాకిచ్చింది. ఇక విశ్వక్ సేన్‌తో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ చేసి హిట్ దిశగా దూసుకుపోతోంది.

సోషల్ మీడియాలో ఫుల్:సినిమాల్లోకి రాకముందు నుంచే సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోన్న నేహా శెట్టి.. ఈ మధ్య కాలంలో మరింతగా సందడి చేస్తోంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ నేహా శెట్టి తన అభిమానులను పెంచుకుంటోంది.

అందాల విందుతో క్రేజ్:నేహా శెట్టి సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఆమె కొంత కాలంగా బోల్డు షో చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో తన లేలేత పరువాలను చూపించేవే ఎక్కువగా ఉంటున్నాయి. తద్వారా నేహా శెట్టి తరచూ వార్తల్లో సెన్సేషన్ అవుతూ ట్రెండింగ్‌లో ఉంటోంది.

నేహా శెట్టి పిక్స్ వైరల్:బ్యూటిఫుల్ హీరోయిన్ నేహా శెట్టి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఈ చిన్నది పైటను తీసేసి మరీ అందాలు మొత్తం కనిపించేలా ఘాటు ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె గ్లామర్ మరింత హైలైట్ అవుతోంది. దీంతో నేహా షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఈ పిక్స్ అన్నీ వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











