రాత్రికి వస్తే 2 లక్షలు ఇస్తా.... హీరోయిన్‌కు అసభ్య సందేశాలు!
సినీ సెలబ్రిటీలను సెక్స్ కోసం టార్గెట్ చేయడం, లైంగిక వాంఛ తీర్చాలంటూ వెంటపడటం లాంటి సంఘటనలు కొత్తమే కాదు. అయితే మీటూ ఉద్యమం తెరపైకి వచ్చిన తర్వాత పలువురు సెలబ్రిటీలు తమకు ఎదురైన ఇలాంటి సంఘటనలు నిర్మొహమాటంగా బయట పెడుతున్నారు.
తాజాగా నటి గాయిత్రి అరుణ్ తనకు ఎదురైన ఇలాంటి అనుభవం గురించి సాక్షాలతో సహా బయట పెట్టారు. ఒక వ్యక్తి తనతో తప్పుగా ప్రవర్తించిన విషయాన్ని ఆమె వెల్లడించారు. ఒక రోజు రాత్రి తనతో గంట గడిపితే రూ. 2 లక్షలు ఆఫర్ చేసిన విషయాన్ని ఆమె బహిర్గతం చేశారు.
స్క్రీన్ షాట్స్
రోహన్ కురియకోసె అనే వ్యక్తి పంపిన మొబైల్ సందేశాలను గాయిత్రి అరుణ్ ఫేస్ బుక్ ద్వారా బయట పెట్టారు. అందులో రోహన్ ఆమెకు రూ. 2 లక్షలు ఆఫర్ చేసి ఒక రాత్రి తనతో గడపాలని కోరినట్లు స్పష్టంటగా కనిపిస్తోంది.

చెంప చెల్లుమనే సందేశం
అయితే తనకు ఇలాంటి నీచమైన సందేశాలు పంపిన వ్యక్తికి గాయిత్రి అరుణ్ ఘాటైన రిప్లై ఇచ్చాను. ‘‘మిస్టర్ రోహన్... నా ప్రార్థనలో నీ తల్లిని లేదా చెల్లిని వారి సేఫ్టీ కోసం తప్పకుండా గుర్తు చేసుకుంటాను' అంటూ చెంప చెల్లుమనే సమాధానం ఇచ్చింది.

గాయిత్రి అరుణ్
గాయిత్రి అరుణ్ ‘పరస్పరం' అనే మలయాళం టీవీ సిరీస్‌లో దీప్తి ఐపీఎస్ పాత్ర పోషించడం ద్వారా పాపులర్ అయ్యారు. ఎమెకు ఎదురైన లైంగిక వేధింపుల అంశం కేరళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

నేనెందుకు బయ భయపడాలి
తనకు వల్గర్ మెసేజ్ పంపడానికి వారికి భయం లేనపుడు దాని గురించి బయట పెట్టడానికి నేనెందుకు భయపడాలి అని గాయిత్రి అరుణ్ ఇటీవల ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

అతడు మైనర్ కాబట్టే లీగల్ స్టెప్ తీసుకోలేదు
తనకు ఈ అసభ్యకరమైన సందేశాలు పంపిన వ్యక్తి మైనర్. అతడి భవిష్యత్ నాశనం అవుతుందనే తాను లీగల్ స్టెప్ తీసుకోలేదు, అతడి తల్లిదండ్రులు కూడా రిక్వెస్ట్ చేశారు అని గాయిత్రి అరుణ్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











