‘అలాంటి కంటెంట్ పెడితే తప్పేంటి?' ఇన్‌స్టా పోస్టులపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ లో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ సెలబ్రిటీలకు కొత్త ఆదాయ వనరుగా మారిపోయింది. ప్రత్యేక కంటెంట్ పేరుతో గ్లామరస్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, బుల్లితెర సెలబ్రిటీలు భారీగా సబ్‌స్క్రైబర్లను పెంచుతున్నారు. ఇప్పటికే విష్ణు ప్రియ, అనన్య నాగళ్ల, ఆశు రెడ్డి వంటి సెలబ్రిటీలు ఈ ఫీచర్‌ను ఉపయోగిస్తూ వార్తల్లో నిలిచారు. వీరు షేర్ చేస్తున్న ఎక్స్‌క్లూజివ్ కంటెంట్‌కు భారీ స్పందన రావడంతో పాటు ట్రోలింగ్ కూడా అదే స్థాయిలో ఎదురవుతోంది.

ముఖ్యంగా విష్ణుప్రియ షేర్ చేసిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీశాయి. కొందరు నెటిజన్లు వాటిపై అభ్యంతరం వ్యక్తం చేయగా, విషయం కేసుల వరకు వెళ్లింది. అయినప్పటికీ చాలామంది సెలబ్రిటీలు మాత్రం "ఇది మా వ్యక్తిగత ఎంపిక" అంటూ తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. ఇప్పుడు ఇదే లిస్ట్‌లో మరో కాంట్రవర్సీ బ్యూటీ చేరింది. "ఇన్‌స్టాలో బోల్డ్ కంటెంట్ పెడితే తప్పేంటి?" అంటూ నేరుగా ప్రశ్నిస్తుంది. ఇంతకీ ఆ కాంట్రవర్సీ బ్యూటీ ఎవరు?

Gayathri Gupta Defends Bold Instagram Content Makes Shocking Industry Comments

ఆ బ్యూటీ ఎవరో కాదు..నటి గాయత్రి గుప్తా. ఈ కాంట్రవర్సీ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు గాయత్రీ గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల కంటే ఆమె బోల్డ్ కామెంట్స్, ఓపెన్ స్టేట్‌మెంట్స్ ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో నటించిన ఆమె, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఫిదా సినిమాలో సాయి పల్లవి స్నేహితురాలి పాత్రలో కనిపించిన ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

అలాగే కొబ్బరి మట్టా, గ్యాంగ్‌స్టర్స్, దయా, 'స్టోరీ డిస్కషన్స్ 2' వంటి ప్రాజెక్ట్‌లలో కూడా నటించింది. అయితే ఆశించిన స్థాయిలో అవకాశాలు రా సినిమాలకు కొంత దూరంగా ఉన్న గాయత్రీ.. ప్రస్తుతం సోషల్ మీడియా, ఇంటర్వ్యూల ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా గాయత్రి గుప్తా ఇన్‌స్టాగ్రామ్ బోల్డ్ కంటెంట్ వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలతో గాయత్రీ గుప్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రీ గుప్తా.. తాను తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ ప్రారంభించానని వెల్లడించింది. అంతేకాదు, ఆ ప్లాట్‌ఫామ్‌లో కొంత బోల్డ్ కంటెంట్ కూడా పోస్ట్ చేస్తున్నానని ఓపెన్‌గా చెప్పింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "నేను ఈ మధ్యనే ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్ స్టార్ట్ చేశా. అందులో కొంచెం బోల్డ్ కంటెంట్ పెడుతున్నా. దాని వల్ల వచ్చే డబ్బులతో నా సినిమాను నేనే ప్రొడ్యూస్ చేసుకోవాలని అనుకుంటున్నా" అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఈ విషయం చర్చకు దారితీస్తోందని యాంకర్ ప్రశ్నించగా.. గాయత్రీ గుప్తా తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చింది.

'విష్ణు ప్రియ, అనన్య నాగళ్ల చేసిన దాంట్లో తప్పేముంది? వాళ్లు సినిమాల్లో బికినీలు వేసుకోలేదా? అలాంటప్పుడు సోషల్ మీడియాలో అలాంటి ఫోటోలు పెడితే సమస్య ఏంటి?" అంటూ ఆమె ఎదురుప్రశ్నించింది. సినిమాల్లో గ్లామర్ పాత్రలు చేయడం ఓకే అనుకునే సమాజం.. అదే సోషల్ మీడియాలో చేస్తే తప్పుగా ఎందుకు చూస్తుందో అర్థం కావడం లేదని ఆమె అభిప్రాయపడింది.

ఇక ఇండస్ట్రీలో అవకాశాల గురించి మాట్లాడుతూ గాయత్రీ గుప్తా మరింత సంచలన వ్యాఖ్యలు చేసింది. "నేను సినిమాల్లోకి వెళ్లి ఎక్స్‌పోజ్ చేస్తే నాకు అవకాశాలు వస్తాయి. కానీ దాని వెనక ఇంకా చాలా ట్రామాలు ఉంటాయి. ఇండస్ట్రీలో ఛాన్సులు రావాలంటే ముందు డైరెక్టర్లు, నిర్మాతలు మనల్ని ట్రై చేస్తుంటారు" అంటూ పరోక్షంగా కాస్టింగ్ కౌచ్ సమస్యపై కూడా స్పందించింది.

అంతేకాదు, "అలాంటి వాళ్లకు అవకాశం ఇవ్వడం కంటే.. నా ఫోటోలు నేనే సోషల్ మీడియాలో పెడితే దాంట్లో తప్పేంటి? నేను ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. నన్ను ఎవరూ వేధించడం లేదు. అందుకే నేను సోషల్ మీడియాలో బోల్డ్ కంటెంట్ పెడుతున్నా" అంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం గాయత్రీ గుప్తా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటే, మరికొందరు మాత్రం ఆమె కామెంట్స్‌పై విమర్శలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X