పెళ్తైన వారానికే నరకం.. కొట్టేవాడు, కాల్చివాడు, కరెంట్ షాక్ పెట్టి..

సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా పలు చిత్రాల్లో నటించింది. అయితే సినిమాల కంటే ఎక్కువగా తన వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌, అవకాశాల పేరుతో జరిగే మోసాలు, అమ్మాయిలపై జరిగే దారుణాల గురించి బహిరంగంగా మాట్లాడి సంచలనం సృష్టించింది. అంతేకాదు, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన షాకింగ్ విషయాలను కూడా బయటపెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా తన చిన్ననాటి జీవితం గురించి చెబుతూ.. సొంత తండ్రే తనను తీవ్రంగా వేధించేవాడని, పెళ్లి అయినా వారానికే విడాకులు తీసుకున్నాననీ ఆరోపించడం సంచలనం గా మారింది. ఇంతకీ ఈ షాకింగ్ కామెంట్స్ బ్యూటీ ఎవరు?

సంచలన వ్యాఖ్యాలు చేసిన నటి ఎవరో కాదు.. గాయత్రి గుప్త (Gayathri Gupta). టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సినిమాల్లో హీరోయిన్‌, ఫ్రెండ్‌, చెల్లె తదితర పాత్రలు పోషిస్తుంది. సాయి పల్లవి నటించిన ఫిదా సినిమాలో ఆమె స్నేహితురాలి పాత్రలో గాయత్రి గుప్తా నటించి ప్రేక్షకుల గుర్తింపు పొందింది.

Gayathri Gupta Opens Up About Toxic Marriage and Childhood Trauma in Emotional Interview

తాజాగా గాయత్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఎప్పుడూ కాంట్రవర్సీలతో వార్తల్లో నిలిచే గాయత్రి గుప్త జీవితంలో ఇంతటి విషాదం దాగి ఉందా అంటూ ఇప్పుడు నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రి.. తన చిన్ననాటి జీవితం, కుటుంబ పరిస్థితులు, పెళ్లి తర్వాత ఎదుర్కొన్న టార్చర్‌ గురించి ఓపెన్‌గా మాట్లాడి అందరినీ భావోద్వేగానికి గురిచేశారు.

గాయత్రి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే తన జీవితం భయానక వాతావరణంలో సాగిందని తెలిపారు. ముఖ్యంగా తన తండ్రి ప్రవర్తన గురించి చెబుతూ ఆమె ఎమోషనల్ అయ్యారు. "మా ఇంట్లో ప్రతిరోజూ గొడవలే ఉండేవి. నా తల్లిని నా కళ్ల ముందే కొట్టేవాడు. కొన్నిసార్లు కరెంట్ షాక్‌లు కూడా పెట్టేవాడు. కొట్టి, వాతలు పెట్టి హింసించేవాడు. చిన్నపిల్లగా నేను అవన్నీ చూస్తూ భయంతో వణికిపోయేదాన్ని" అంటూ ఆమె చెప్పిన మాటలు షాక్‌కు గురిచేశాయి.

అంతేకాదు, తన తల్లి చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకుందని, కేవలం 16 ఏళ్లకే తాను పుట్టానని గాయత్రి వెల్లడించారు. జీవితంలో సరైన మద్దతు లేకపోవడం, కుటుంబంలో హింసాత్మక వాతావరణం ఉండటం వల్ల చిన్నప్పటి నుంచే మానసికంగా ఎంతో కృంగిపోయానని తెలిపారు. "నాకు తండ్రి అంటే ప్రేమ కంటే భయమే ఎక్కువ. ఆయన వల్ల మా కుటుంబం నరకం అనుభవించింది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక తన వ్యక్తిగత జీవితంలో జరిగిన మరో షాకింగ్ విషయాన్ని బయటపెడుతూ.. పెళ్లైన కేవలం వారం రోజులకే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. "అది ఒక టాక్సిక్ మ్యారేజ్‌. శారీరకంగా, మానసికంగా చాలా హింసించారు. ఆ బంధంలో ఇంకొన్ని రోజులు ఉంటే నేను పూర్తిగా విరిగిపోయేదాన్ని. అందుకే వెంటనే బయటకు వచ్చాను" అని గాయత్రి తెలిపారు. పెళ్లి అనే వ్యవస్థపై కూడా ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. "రక్షణ, గౌరవం లేని చోట ఉండటం కంటే ఒంటరిగా జీవించడం చాలా మంచిది" అని అన్నారు.

ఇక సినిమా ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాల గురించి కూడా గాయత్రి నిర్మొహమాటంగా మాట్లాడారు. కాస్టింగ్ కౌచ్‌, అవకాశాల పేరుతో జరిగే దారుణాలపై తాను ఓపెన్‌గా మాట్లాడటమే తన కెరీర్‌కు ఇబ్బందులు తెచ్చిందని ఆరోపించారు. "టాలెంట్ కంటే కొన్ని చోట్ల అమ్మాయిల బలహీనతలను ఉపయోగించుకోవాలని చూస్తారు. నేను వాటికి ఎదురు మాట్లాడటంతో కొందరు నన్ను ఇండస్ట్రీలో పక్కన పెట్టారు" అని ఆమె అన్నారు.ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే కొంతమంది హీరోయిన్లు ఎదుర్కొనే పరిస్థితులు చాలా బాధాకరంగా ఉంటాయని, అమ్మాయిలను మానసికంగా బలహీనపరిచి వాడుకోవాలని ప్రయత్నిస్తారని గాయత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. "నేను ఎప్పుడూ నిజాలు మాట్లాడాను. అందుకే చాలా అవకాశాలు కోల్పోయాను. కానీ నా స్వాభిమానాన్ని మాత్రం కోల్పోలేదు" అని స్పష్టం చేశారు.

ఇప్పటికీ జీవితంపై ఆశ వదల్లేదని, ప్రస్తుతం 'First Time' అనే సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నానని తెలిపారు. అంతేకాదు, భవిష్యత్తులో తానే స్వయంగా ఒక ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించాలని కలగంటున్నట్లు వెల్లడించారు. "నా జీవితంలో ఎన్నో బాధలు చూశాను. కానీ వాటితోనే ఆగిపోవాలనుకోవడం లేదు. ఇంకా చాలా చేయాలి" అంటూ ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా గాయత్రి గుప్త బయటపెట్టిన ఈ షాకింగ్ నిజాలు ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. తెరపై బోల్డ్‌గా కనిపించే ఈ నటి.. నిజ జీవితంలో మాత్రం ఎన్నో మానసిక గాయాలతో పోరాడిందని ఆమె అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X