‘మగాళ్లను చూస్తే నాలో అలాంటి ఫీలింగ్... 5 మందితో అందుకే బ్రేకప్’

యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టి నటిగా మారింది గాయత్రి గుప్తా. తన చలాకీతనం, ప్రతిభతో తక్కువ కాలంనే చాలా సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది. ఫిదా, కొబ్బరిమట్ట, ఐస్‌క్రీమ్ తదితర సినిమాలలో నటించింది. అయితే ముక్కుసూటితనం కారణంగా ఎదగలేకపోయింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ రక్కసిపై పలుమార్లు సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది గాయత్రి గుప్తా. అందరి ఆడపిల్లల మాదిరిగానే తన జీవితంలోనూ ప్రేమ ఉందని, కానీ అది ఎక్కువరోజులు సాగలేదని వాపోయింది. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రిలేషన్‌షిప్, బ్రేకప్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

నన్ను రెండేళ్ల పాటు హౌస్ అరెస్ట్ చేసుకున్నా.. అలాంటి భయంకరమైన జీవితం నాది. బయటకు వచ్చి అమ్మాయి సింగిల్‌గా బ్రతుకుతుందంటే కెలికేవాళ్లు ఎక్కువగా ఉన్నారు. ఈమె రెడీ ఫర్ స్లిపింగ్ అన్న ఓపీనియన్‌తో ఉంటారు. ఫిల్మ్ ఆఫర్ ఇస్తారు.. ఇంటికొచ్చి మాట్లాడుకుందామంటారు. నేను తొలి నుంచి అమ్మాయా? అబ్బాయా అనేది చూడను. తొందరగా అందరినీ నమ్మేస్తాను. మన ఫ్రెండే కదా? ఎప్పటి నుంచో కలుస్తున్నాం, పరిచయం ఉంది. ఇంటికి ఇన్వైట్ చేస్తా అంతే గోకడం స్టార్ట్ చేస్తారు. అలా రెండు మూడు సార్లు అయ్యేసరికి ఇలాంటివి ఆపేశానని గాయత్రి తెలిపారు.

Gayathri Gupta Reveals Painful Breakups Emotional Trauma and Two-Year Isolation After Love Failure

ఆ తర్వాత అర్ధరాత్రి 3, 4 గంటలకుడోర్లు కొట్టేవారు. నరకం అనుభవించా.. ఏం చేయాలో అర్ధం కాలేదు. ఈ విషయాన్ని మా ఫ్రెండ్‌కి చెప్పా.. చాలా భయంగా ఉందని, ఉండలేకపోతున్నానని అన్నా. దాంతో మా ఫ్రెండ్ రెండు మూడు రోజులు నా రూమ్‌లోనే ఉన్నాడు. ఒకడు డోర్ కొడితే వాడిని ఇద్దరం కలిసి చితక్కొట్టాం. రూమ్‌లో ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి.. నన్ను నేను సేఫ్‌గా ఉంచుకోవడానికి 10 కత్తులు కొన్నా. సోఫా వెనుక ఒకటి, టీవీ దగ్గర ఒకటి, కిచెన్‌లో ఒకటి అలా ఇంట్లో ఉన్న అన్ని ప్లేస్‌లలో కత్తులు దాచిపెట్టా. నీకు మరి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువని మా ఫ్రెండ్స్ చెప్పేవారు. అలా ఉండకపోతే మనకు ఎక్కడా సేఫ్టీ ఉండదని గాయత్రి అన్నారు.

నేను స్వతహాగా ఒక లాయల్ పర్సన్‌ని, నాకొక రిలేషన్‌షిప్ కావాలి.. అందులో నేను లాయల్‌గా ఉంటాను, అవతలి వ్యక్తి లాయల్‌గా ఉండాలని కోరుకుంటా. అయితే నేను తీసుకున్న నిర్ణయాల వల్ల కావొచ్చు, మరేదైనా కారణం కావొచ్చు.. ఐదుగురితో బ్రేకప్స్ జరిగాయి. నేను ప్రతిదానిలో సీరియస్‌గా ఉండాలనే కోరుకున్నా. కానీ లాస్ట్ బ్రేకప్ అయితే హారిబుల్. ఇంట్లో నుంచి రావడం, పాత బ్రేకప్స్ కాకుండా ఎక్కువ బాధపడ్డా. ఆ పిల్లాడితో ఎమోషనల్ కనెక్షన్ ఎక్కువైపోయింది. ఒక్కసారిగా తను నా జీవితంలో లేడీని తెలిసి తట్టుకోలేకపోయా. రెండేళ్లు నన్ను నేను హౌస్ అరెస్ట్ చేసుకుని చనిపోయే స్టేజ్ వరకు వెళ్లా అతను చాలా మంచి వ్యక్తి. త్వరలో అతను డైరెక్టర్ కాబోతున్నాడు. ఇద్దరం భూతులు తిట్టుకునేంతగా క్లోజ్‌గా ఉండేవాళ్లమని గాయత్రి గుప్తా వెల్లడించారు.

నువ్వు అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా? నీకెందుకు ఈ పంచాయతీలని మా ఫ్రెండ్స్, రిలేటివ్స్ చెబుతుంటారు. కానీ నాకు అబ్బాయిలతోనే హ్యాపీగా ఉండేది. ఎందుకంటే వాళ్లే ప్రొటెక్ట్ చేస్తారు. బయట ప్రాబ్లమ్ వస్తే అబ్బాయి వచ్చి గొడవపడతాడు. అలాంటి ఈ ఫెమినిజం అనే కాన్సెప్ట్ నాకు ఫన్నీగా అనిపిస్తుంది. మనకి మేల్ డామినేషన్ ఇష్టం లేదు.. కానీ ఆడామగా ఒకరి మీద మరొకరం ఆధారపడాల్సిందే. నిన్ను తొక్కుతున్నాడు అంటే నువ్వు తొక్కనిస్తున్నావు.. ఎన్నో తరాల నుంచి మనది మేల్ డామినేషన్ సొసైటీయే. ఏం జరిగినా నువ్వు దెబ్బకు దెబ్బ తీయాల్సిందే. ప్రపంచంలో సమానత్వం అన్న కాన్సెప్టే లేదు.. పోటీ ప్రపంచంలో బతుకుతూ సమానత్వం కావాలంటే ఎలా? అని గాయత్రి ప్రశ్నించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: gayathri gupta tollywood news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X