శివాజీపై యంగ్ హీరోయిన్ ఫైర్.. పచ్చకామెర్లోడికి పచ్చగానే కనిపిస్తుందంటూ...
'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో శివాజీ (Sivaji) మహిళల డ్రెస్సింగ్‌పై చేసిన కామెంట్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ వివాదం ముగిసిపోయిందిలే అనుకున్న ప్రతిసారి ఏదోక సందర్భంలో మళ్లీ తెరపైకి వస్తునే ఉంది. అప్పట్లో ఆయన మహిళలు పబ్లిక్ ఈవెంట్స్‌లో సంప్రదాయ దుస్తులు ధరించాలని సూచించిన మాటలు పెద్ద చర్చకు దారి తీసింది. ఈ వివాదంలోకి యాంకర్ అనసూయ ఏంట్రీ ఇవ్వడంతో తారస్థాయికి వెళ్లింది. మహిళా కమిషన్ వరకు వెళ్లిన ఈ అంశంలో శివాజీ క్షమాపణలు చెప్పినా.. పరిస్థితి మాత్రం పూర్తిగా సద్దుమణగడం లేదు. అయితే తాజాగా ఈ వివాదం మళ్లీ చెలరేగేలా నటి గాయత్రి గుప్తా సంచలన వ్యాఖ్యాలు చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
టాలీవుడ్ బోల్డ్ యాక్ట్రెస్ గాయత్రి గుప్తా గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. సినిమాలపై ఆసక్తితో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించి, ఆ తర్వాత 'ఫిదా, కొబ్బరి మట్ట, ఐస్ క్రీం వంటి సినిమాలో నటించి ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది. అయితే సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత వివాదాలతో, బోల్డ్ కామెంట్స్ తోనే ఆమె ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. గతంలో మీటూ ఉద్యమంలో గాయత్రి గుప్త చేసిన సంచలన ఆరోపణలు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యాయి.

ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ గురించి ఆమె బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాలను కుదిపేశాయి. ఇప్పుడు మరోసారి గాయత్రి గుప్తా మరోసారి వార్తల్లో నిలిచారు. రీసెంట్ గా ఆమె ఓ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ శివాజీకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.
తాజాగా నటి గాయత్రి గుప్తా ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో చీరలో కనిపించారు. ఈ సమయంలో గాయత్రీ ని యాంకర్ ఆసక్తికరంగా ప్రశ్నించింది. 'మీరు చీరలో రావడం కూడా శివాజీ గారు చేసిన కామెంట్స్ వల్లేనా?' అని అడగడంతో వేదికపై ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈ ప్రశ్నకు గాయత్రి గుప్తా కాస్త హార్ష్ టోన్‌లోనే స్పందించింది. 'నేను చీర వేసుకోవాలా, బికినీ వేసుకోవాలా అనేది పూర్తిగా నా ఇష్టం. ఎవరో చెప్పారని నేను మారను. నాకు ఏది కంఫర్టబుల్‌గా ఉంటే అదే వేసుకుంటాను. పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట.. అలా ఉంది ఆయన వ్యవహారం. చూసే చూపులో లోపం పెట్టుకుని ఎదుటివారిని విమర్శించడం సరికాదు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
గాయత్రి గుప్తా చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 'డ్రెస్సింగ్ అనేది వ్యక్తిగత విషయం, ఆమె అన్నదానిలో తప్పేముంది?' అని కొందరు గాయత్రిని సమర్థిస్తుంటే.. 'శివాజీ గారు పెద్దవాడు, ఆయన ఒక సలహా ఇచ్చారు. దానికి ఇంతలా రియాక్ట్ అవ్వాలా?' అని శివాజీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇలా మరోసారి శివాజి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే... గాయత్రి గుప్తా చేసిన వ్యాఖ్యలు మళ్లీ ఈ వివాదానికి కొత్త ఊపిరి పోసినట్టే కనిపిస్తున్నాయి. ఇక ఈ విషయంపై శివాజీ మరోసారి స్పందిస్తారా? లేక మౌనం పాటిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆయన స్పందిస్తే... ఈ వివాదం మరోసారి పెద్ద స్థాయికి వెళ్లే అవకాశం కూడా ఉంది.


Click it and Unblock the Notifications