నమ్మిన వాళ్లే మోసం.. రెండు సార్లు సూసైడ్ .. హీరోయిన్ కన్నీటి గాథ!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన నటి గీతా సింగ్... ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు వినేవారిని కలచివేస్తున్నాయి. తెరపై నవ్వులు పంచిన ఈ నటి, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు, చేదు అనుభవాలు ఎదుర్కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ముఖ్యంగా తాను ఆర్థిక నష్టం, మోసాలు, కెరీర్ అవకాశాలు అన్ని కలిసి తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయో గీతా సింగ్ వెల్లడించింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

'కితకితలు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయమైన గీతా సింగ్, ఆ తర్వాత కామెడీ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దర్శకులు తేజ, ఈవీవీ సత్యనారాయణ ప్రోత్సాహంతోనే తన కెరీర్ ముందుకు సాగిందని ఆమె చెప్పింది. ఆ సినిమా కోసం తాను బరువు పెరగడం అప్పట్లో కెరీర్‌కు ప్లస్ అయినప్పటికీ, తర్వాత అదే తనకు మైనస్‌గా మారిందని తెలిపింది. ఇండస్ట్రీలో లుక్‌కు ఉన్న ప్రాధాన్యం కారణంగా అవకాశాలు తగ్గాయని అర్థమవుతోందని ఆమె వ్యాఖ్యానించింది.

Geetha Singh Emotional Story

ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే... చిన్నప్పటి నుంచి మేనత్త దగ్గర పెరిగిన ఆమెకు, ఆమెలోనే పెద్ద ఆధారం ఉండేది. కానీ ఆమె మరణం తర్వాత తాను పూర్తిగా మానసికంగా కుంగిపోయానని తెలిపింది. అంతేకాకుండా తండ్రి, సోదరుడిని కూడా కోల్పోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ తన భుజాలపై పడ్డాయని చెప్పింది. ఈ పరిస్థితుల్లో తనకు దగ్గరగా ఉన్నవాళ్లే మోసం చేయడం మరింత దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేసింది.

ఒక సీరియల్ నటి చెప్పిన మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ నష్టం వాటిల్లిందని గీతా సింగ్ వెల్లడించింది. ఆ ఒక్క వ్యక్తి వల్లే సుమారు 23-24 లక్షలు నష్టం జరిగిందని, మొత్తంగా జీవితంలో 9 నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఆర్థికంగా కోల్పోయానని చెప్పింది. రోజూ కష్టపడి దాచుకున్న డబ్బును నమ్మినవాళ్లకు ఇవ్వడం చివరకు తనకే నష్టం అయ్యిందని ఆమె కన్నీటి పర్యంతమైంది.

ఇంతటి ఒత్తిడి, నష్టాలు, ఒంటరితనం కారణంగా తాను రెండు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెప్పడం మరింత షాక్‌కు గురి చేసింది. "తెరపై నవ్వించినా... నా జీవితంలో ఎంత బాధ ఉందో ఎవరూ ఊహించలేరు" అంటూ ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నానని, జీవితం ఇచ్చిన పాఠాలను అర్థం చేసుకుంటున్నానని తెలిపింది.

కెరీర్ విషయంలో కూడా గీతా సింగ్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. బాలీవుడ్‌లోని ప్రముఖ బ్యానర్ యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి హీరోయిన్ అవకాశం వచ్చినప్పటికీ, దాన్ని ఫేక్ కాల్‌గా భావించి పట్టించుకోకపోవడంతో ఆ ఛాన్స్ మిస్ అయిందని చెప్పింది. తర్వాత నటుడు అలీ ద్వారా ఆ విషయం తెలుసుకుని చాలా బాధపడ్డానని పేర్కొంది. సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల తమిళంలో కూడా వచ్చిన అవకాశాలను సరిగా ఉపయోగించుకోలేకపోయానని అంగీకరించింది.

ఇక ప్రస్తుత పరిస్థితులపై స్పందిస్తూ... ఇండస్ట్రీలో కమెడియన్లకు అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయని గీతా సింగ్ ఆవేదన వ్యక్తం చేసింది. ఒకప్పుడు ఈవీవీ సత్యనారాయణ సినిమాల్లో 60-70 మంది కమెడియన్లు ఉండేవారని, ఇప్పుడు మాత్రం హీరో, హీరోయిన్ తప్ప మరెవరికి పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదని విమర్శించింది. అప్పటి సినిమా వాతావరణం ఒక కుటుంబంలా ఉండేదని, ఇప్పుడు ఆ కల్చర్ తగ్గిపోయిందని గుర్తుచేసుకుంది.

టీవీ రంగంలో కూడా తనకు స్థిరమైన అవకాశాలు రావడం లేదని ఆమె చెప్పింది. కొన్ని షోలలో పనిచేసినా, కొన్ని ఎపిసోడ్‌ల తర్వాత పిలవడం లేదని, రెమ్యూనరేషన్ తగ్గించుకున్నా కూడా నిరంతర అవకాశాలు దక్కడం లేదని పేర్కొంది. హిందీలో భారతి సింగ్‌లాంటి కమెడియన్లకు ఇచ్చే ప్రాధాన్యం తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇవ్వాలని కోరింది. భవిష్యత్తులో కమెడియన్లతో ప్రత్యేక షోలు చేయాలని తాను ప్లాన్ చేస్తున్నానని కూడా వెల్లడించింది.

Read more about: geeta singh teja tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X