అర్జెంట్ గా బాయ్ ఫ్రెండ్ కావలెను.. వివాదాస్పద పోర్న్ నటి ప్రకటన.. ఎలాంటి వాడు కావాలంటే?
పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా పాటు, నటి గెహానా వశిష్ట్ కూడా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 'గందీ బాత్' ఫేమ్ గెహానాను పోర్న్ చిత్రాల షూటింగ్ చేసిన నేపధ్యంలో ఫిబ్రవరిలో ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆమె బెయిల్ మీద విడుదల అయింది. అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పెడుతూ రచ్చ చేసే ఆమె ఇప్పుడు ఏకంగా బాయ్ ఫ్రెండ్ కావలెను అంటూ ప్రకటన చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

డొంకంతా కదిలి
పోర్న్ వీడియోలను తీసి ఓటీటీ కంటెంట్‌లో అప్‌లోడ్ చేశారనే నేరంతో రాజ్‌కుంద్ర్రా అరెస్టైన సమయంలో ఈమె పేరు బాగా పాపులర్ అయింది. నిజానికి ఆయన అరెస్ట్ కంటే ముందే పోర్న్ చిత్రంలో నటిస్తుండగా గెహనా వశిష్ట్ ను పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు. అసలు ఆ కేసు తీగలాగితేనే డొంకంతా కదిలి రాజ్ కుంద్రా బయటకు వచ్చారు.

వాట్సప్ చాట్ కూడా
అయితే ఆ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు పోలీసులకు గెహనా బంపరాఫర్ ఇచ్చినట్లు ఆ తరువాత. అందుకు సంబంధించిన వాట్సప్ చాట్ కూడా బయటకు వచ్చింది. తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు పోలీసులకు గెహానా వశిష్ట్ రూ.15 లక్షలు లంచం ఇచ్చేందుకు సిద్ధమైందని తెలిసింది.

లంచం
తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులతో నన్ను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు మీకెంత కావాలో చెప్పండి అని ఆమె పోలీసులకు ఆఫర్ ఇచ్చారని 15 లక్షలు వరకు ఇవ్వగలను నన్ను వదిలేయండి.... అని పోలీసులతో ఒప్పందం కుదుర్చుకుందని దర్యాప్తులో తేలింది. అయితే పోలీసులే లంచం డిమాండ్ చేశారని గెహనా ఆరోపించింది. అయితే గెహనా నటించిన మూడు అశ్లీల వీడియోలు కూడా ఆ తర్వాత బయటకు వచ్చాయి.

పోర్న్ వెబ్‌సైట్ గురించి
గతంలో, నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా యొక్క పోర్న్ వెబ్‌సైట్ గురించి ఆమె అభిప్రాయాలను పంచుకున్నప్పుడు గెహానా వశిష్ట్ పేరు బాగా వెలుగులోకి వచ్చింది. రాజ్ మరియు శిల్ప తనకు చాలా సంవత్సరాలుగా తెలుసునని, తన ప్రకారం, ఈ కేసులో రాజ్ కుంద్రా దోషి కాదని ఆమె చెప్పింది.

బాయ్ ఫ్రెండ్ కావలెను
నటి, మోడల్ గెహానా వశిష్ట్ తరచుగా తన ఫ్యాషన్ లుక్స్ మరియు అందమైన బాడీ ఫిగర్‌ని ప్రదర్శిస్తూ ఉంటుంది. గెహానా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్‌ను పంచుకుంది, అందులో 'నేను తొందరపడుతున్నాను, నాకు వీలైనంత త్వరగా బాయ్‌ఫ్రెండ్ కావాలి, నేను ఈ రాత్రి 8 గంటల వరకు ఈ విషయాన్ని లాక్ చేయాలి. కాబట్టి ఎవరైతే అందంగా ఉంటారో, పూర్తిగా ఒంటరిగా, యవ్వనంగా మరియు ధనవంతులుగా ఉంటారో, వారు. వీలైనంత త్వరగా నాకు మెసేజ్ చేయండి'' అని పోస్ట్ పెట్టింది.


Click it and Unblock the Notifications











