టాలీవుడ్‌లో జెనీలియా రీ ఎంట్రీ? భూమిక దారిలో
టాలీవుడ్‌లో విలక్షణమైన పాత్రలతో హీరోయిన్‌గా రాణించిన జెనీలియా డిసౌజా తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యారు. రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకొన్న తర్వాత ఆమె నటనకు తాత్కాలికంగా స్వస్తి చెప్పారు. పిల్లలను, ఇంటిని చూసుకొంటూ కాలం వెల్లదీస్తున్నారు. మధ్యలో కొన్ని హిందీ, మరాఠీ సినిమాల్లో గెస్ట్‌గా కనిపిస్తున్నది. అయితే తాజాగా మీడియాలో జెనిలియా గురించి ఓ వార్త వెలుగు చూసింది.
తెలుగు సినిమాలో నటించడానికి జెనీలియా రెడీగా ఉన్నారని, ఓ నిర్మాత చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. అయితే అధికారికంగా మాత్రం వెల్లడికాలేదు. కుదిరితే కప్పు కాఫీ అంటూ ప్రేక్షకుల మనసులో నిలిచి పోయిన జెనీలియా మళ్లీ టాలీవుడ్‌లో నటిస్తుందా అనే ప్రశ్నకు సమాధానం ఆమె స్పందిస్తే తప్ప క్లారిటీ రాలేదు.

ఇటీవల కాలంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి భూమిక తదితర హీరోయిన్లు సక్సెస్ సాధించారు. జెనీలియా కూడా ఆ ప్రయత్నంలో ఉందా అనే విధంగా వార్తలు రావడం ప్రేక్షకులకు సంతోషమే అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











