కరోనాను అలా ఎదుర్కోగలం.. స్వీయ అనుభవాలు చెప్పిన జెనీలియా
ప్రస్తుతం దేశమంతా కరోనా ప్రభావం ఉంది. రోజుకు కొన్ని వేల కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ముంబై, తమిళనాడు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా తాండవం చేస్తోంది. అయితే కరోనాకు సెలెబ్రిటీలు ఎక్కువగా గురవుతుండటం ఆందోళన కలిగించే విషయం. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టని స్టార్స్‌కు సైతం కరోనా సోకుతోంది. తాజాగా జెనీలియాకు కరోనా సోకిందని, ప్రస్తుతం నెగెటివ్ వచ్చిందని చెప్పుకొచ్చింది.
జెనీలియా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి చెప్పుకుండా చికిత్స తీసుకుని పూర్తిగా కోలుకున్న తరువాత నెగిటివ్ వచ్చిందన్న విషయాన్ని ప్రకటించింది. ఈ మేరకు జెనీలియా షేర్ చేసిన పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. 'హాయ్.. నాకు మూడు వారాల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. 21 రోజులుగా నాకు లక్షణాలు కనబడుతున్నాయి. దేవుడి దయ వల్ల నాకు ఈ రోజు నెగిటివ్ అని వచ్చింది. మొదట్లో ఈ కరోనా అంతగా బాధించకపోయినా.. ఐసోలేషన్‌లో ఉంచిన 21 రోజులు మాత్రం కష్టంగా గడిచింది.

అది చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఈ డిజిటల్ కారణంగా ఒంటరిగా ఉన్నాన్ననే ఫీలింగ్ కలగలేదు. మొత్తానికి నన్ను ప్రేమించే నా ఫ్యామిలీని చేరుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. మిమ్మల్ని ప్రేమించిన వారు మీ చుట్టూ ఉంటే అదే మనకు కావాల్సిన బలాన్ని ఇస్తుంది.. అనుమానం వస్తే తొందరగా పరీక్షలు చేయించుకోవాలి.. మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి.. ధృడంగా ఉండాలి.. అప్పుడే ఈ వైరస్‌ను ఎదుర్కోగలం.. ప్రేమతో మీ జెనీలియా' అంటూ ఓ నోట్ విడుదల చేసింది.



Click it and Unblock the Notifications











