సీఎం ఇంటికి కోడలిగా.. పెళ్లికి ముందే హీరోతో ఆ పని.. 14 ఏళ్లకి నోరు విప్పిన హీరోయిన్
నటీనటులు ఏళ్ల నుంచి సీక్రెట్స్‌గా ఉంచిన కొన్ని విషయాలను ఇంటర్వ్యూలలో బయటపెడుతూ కలకలం రేపుతున్నారు. వీటిలో ఎఫైర్స్, ప్రేమాయణాలు ఇతర వ్యక్తిగత విషయాలు ఉంటున్నాయి. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ తన పెళ్లికి ముందు జరిగిన విషయాలను ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టి బాంబు పేల్చారు. ఆ హీరోయిన్ ఎవరు? పెళ్లికి ముందు ఆమె ఏం చేసింది? ఈ వివరాల్లోకి వెళితే..
తెలుగువారి హాసినీ
ముంబై నుంచి టాలీవుడ్‌లో అడుగుపెట్టి స్టార్ స్టేటస్ అందుకున్నారు జెనీలియా డిసౌజా. తుజే మేరే కసం అనే హిందీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. సత్యం చిత్రంతో తెలుగువారిని పలకరించారు. ఆ తర్వాత సాంబ, సై, హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ, శశిరేఖా పరిణయం, ఆరెంజ్, రెడీ, నా ఇష్టం తదితర సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, మరాఠీ చిత్రాల్లో నటించారు. బొమ్మరిల్లులో అల్లరి హాసినీగా నటించి హాసినీగా తెలుగునాట గుర్తింపు తెచ్చుకున్నారు జెనీలియా.

సీఎం ఇంటికి కోడలిగా
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్‌ముఖ్ కుమారుడు, బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌తో ప్రేమలో పడిన జెనీలియా.. 9 ఏళ్ల పాటు అతనితో డేటింగ్ చేసింది. వీరి పెళ్లికి మతాల అడ్డురాగా.. క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం ఒకసారి, హిందూ సాంప్రదాయం ప్రకారం మరోసారి పెళ్లి చేసుకుంది ఈ జంట. అలా ముఖ్యమంత్రి గారికి కోడలిగా దేశ్‌ముఖ్‌ల ఇంట్లో అడుగుపెట్టివంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. బాలీవుడ్‌లో సెలబ్రెటీ కపుల్‌గా జెనీలియా - రితేష్‌లు తళుక్కుమంటున్నారు. తన భర్తకు మహిళలంటే చాలా గౌరవం. తనను ఎంతో బాగా చూసుకుంటాడని, తాను షూటింగ్‌కు వెళ్లినప్పుడు పిల్లలను చూసుకుంటాడని చెప్పింది. ఇంటి బాధ్యతలు చూసుకుంటే అర్ధం చేసుకునే భర్త దొరకడం అదృష్టమని అంటుంది జెనీలియా.
ఆ పెళ్లిపై 14 ఏళ్ల తర్వాత స్పందన
కాగా.. రితేష్ కంటే ముందే జెనీలియాకు పలువురు స్టార్స్‌తో ఎఫైర్స్ ఉన్నాయని ముఖ్యంగా బాలీవుడ్ సూపర్‌స్టార్ జాన్ అబ్రహంతో ఆమె డేటింగ్ చేసిందని, ఇద్దరికీ సీక్రెట్‌గా పెళ్లి జరిగిపోయిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అంతేకాదు.. జెనీలియా- జాన్ అబ్రహాంల పెళ్లి ఫోటోలు కూడా బయట చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ వ్యవహారంపై దాదాపు 14 ఏళ్ల తర్వాత స్పందించారు జెనీలియా. ఈ సీనియర్ నటి నటించిన సితారే జమీన్ పర్ చిత్రం జూన్ 20న విడుదల కానుంది. ఇందులో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ హీరో. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జెనీలియా .. జాన్ అబ్రహంతో పెళ్లిపై స్పందించారు.
ఆ పీఆర్‌ల వల్లే ఇదంతా
నేనే, జాన్ కలిసి 2011లో ఫోర్స్ చిత్రంలో కలిసి నటించామని.. ఈ సినిమాలోని ఓ సీన్‌లో మా ఇద్దరికీ పెళ్లి జరుగుతుందని జెనీలియా తెలిపారు. ఇది నిజమైన పెళ్లి అనుకుని చాలా మంది ప్రచారం చేసేశారని.. ఫోటోలు కూడా వైరల్ అయ్యాయని జెనీలియా తెలిపారు. అయితే అది కేవలం ప్రచారం మాత్రమేనని, ఇందులో ఎలాంటి నిజం లేదని ఆమె తేల్చిచెప్పారు. కొందరు పీఆర్‌ల వల్లే ఇలా జరిగిందని.. వారెందుకు ఇలా చేశారో వాళ్లని అడగాలని జెనీలియా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు బాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి.


Click it and Unblock the Notifications











