వయసులో తట్టుకోలేం... 17 ఏళ్లకే ఆ పనిచేశా... నేషనల్ క్రష్ షాకింగ్ కామెంట్స్
చిత్ర పరిశ్రమ విచిత్రమైనది.. ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డా రాని ఫలితం, రాత్రికి రాత్రికి తలుపు తడుతుంది. తమ ప్రమేయం లేకుండా తమ పేరు దేశం మొత్తం మారుమోగుతుంది. ఈ కోవలోకే వస్తారు మరాఠీ నటి, నేషనల్ క్రష్ గిరిజా ఓక్. కేవలం సింగిల్ ఫోటోతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు గిరిజా ఓక్ గాడ్బోలే. ఓ ఇంటర్వ్యూలో నీలిరంగు చీర కట్టుకుని సింపుల్‌గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ అందానికి యువత ఫిదా అయిపోయింది. ఒక్కసారిగా నేషనల్ క్రష్ అంటూ కొత్త ట్యాగ్ వచ్చి చేరింది. ఆమె కనిపించినా, చిన్న ట్వీట్ చేసినా చాలు క్షణాల్లో వైరల్ అవుతోంది. గిరిజా ఓక్ ఇంటర్వ్యూల కోసం జాతీయ మీడియా సంస్థలు క్యూకడుతున్నాయి. తాజాగా తన కుటుంబం, తల్లిదండ్రులు, చిన్న వయసులో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు గిరిజ. ఈ వివరాల్లోకి వెళితే..
రాత్రికి రాత్రి నేషనల్ క్రష్‌గా
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన గిరిజ.. తొలుత 2004లో మరాఠీ చిత్రం మానినిలో నటించారు. ఈ దశలో తారే జామీన్ పార్, గుల్‌మోహర్, హౌస్‌ఫుల్, లజ్జ, సైకిల్ కిక్, షోర్ ఇన్ ది సిటీ, బాజీ, మౌలీ, ఖాలా, జవాన్, ది వ్యాక్సిన్ వార్, ఇన్స్‌పెక్టర్ జిండె వంటి మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లో నటించింది గిరిజ. వాటితో పాటు బుల్లితెర ఇండస్ట్రీలోనూ ఈ ముద్దుగుమ్మ అడుగుపెట్టారు. దేశంలో ఫేమస్ క్రైమ్ సిరీస్‌గా గుర్తింపు తెచ్చుకున్న సీఐడీ ద్వారా నటనా రంగంలోకి వచ్చారు. ఆ తర్వాత లేడీస్ స్పెషల్, పాండు, కార్టెల్, మోడ్రన్ లవ్: ముంబై తదితర హిందీ, మరాఠీ సీరియల్స్‌లో నటించారు. నటిగా గుర్తింపు దక్కినప్పటికీ గిరిజ అంతగా పాపులర్ కాలేదు. ఈ దశలో గతేడాది ఇచ్చిన ఇంటర్వ్యూ ఆమె జీవితాన్ని మార్చేసింది. ఇందులో అనేక కొత్త విషయాలు పంచుకోవడంతో పాటు హోమ్లీ లుక్‌లో గిరిజ అందం అందరినీ ఫిదా చేసింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె ఫోటోలే దర్శనమివ్వడంతో రాత్రికి రాత్రి నేషనల్ క్రష్‌గా మారిపోయారు గిరిజా ఓక్.

ఇంటిమేట్ సీన్స్‌లో అలా
గుల్షన్ దేవయ్యతో కలిసి ఆమె థెరపీ షెరపీ అనే వెబ్‌సిరీస్‌లో నటించారు. ఇందులో ఓ ఇంటిమేట్ సీన్ ఉండగా.. షూటింగ్ సమయంలో ఆయన తనతో వ్యవహరించారు, ఒక నటుడిగానే కాకుండా ఒక మగాడిగా అండగా నిలిచిన విషయాన్ని బయటపెట్టి గుల్షన్ దేవయ్యని పొగిడారు. అయితే ఈ ఇంటర్వ్యూ ఇంత పాపులర్ అవుతుందని కానీ, తన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాయని కానీ అస్సలు ఊహించలేదట. అనుకోకుండా వచ్చిన పాపులారిటీతో తాను ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని గిరిజ తెలిపారు. ఇదే సమయంలో కొందరు తన ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారని.. వాటిని అభ్యంతరకరంగా, అసభ్యంగా సోషల్ మీడియాలో పెడుతుండటంతో గిరిజా ఓక్ ఫైర్ అయ్యారు. వాటిని పెద్దయ్యాక నా కొడుకు చూస్తే నా పరిస్థితి ఏంటంటూ ప్రశ్నించారు.
17 ఏళ్ల వయసులోనే ఆ నిర్ణయం
తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రులు, ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ, ఇండస్ట్రీలో పని గంటలని బయటపెట్టారు గిరిజ. నా చిన్నతనంలోనే అమ్మానాన్న విడిపోయారు. ఇది నాపై తీవ్ర ప్రభావం చూపించడంతో తట్టుకోలేకపోయా.. చివరికి సైకియాట్రిస్ట్‌ను కూడా కలిశా. మానసికంగా కృంగిపోవడంతో 17 ఏళ్ల వయసులోనే థెరపీ తీసుకున్నా.. అప్పటి నుంచి కొన్నేళ్లపాటు ఆ థెరపీలు తీసుకుంటూనే ఉన్నా. నా పెళ్లి జరగడానికి కొద్దికాలం ముందు అమ్మ రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ వయసులో రెండో పెళ్లి చేసుకోవాలంటే మానసికంగా ఎంతో ధైర్యం కావాలి. అంతేకాదు.. అమ్మ రెండో పెళ్లికి నేనే సాక్షిని, సాక్షిగా సంతకం కూడా పెట్టానని గిరిజ తెలిపారు.
10 - 12 గంటలు షూటింగ్‌లోనే
పెళ్లికి ముందు కానీ, పెళ్లి తర్వాత కానీ ఎప్పుడూ షూటింగ్స్‌కి ఒంటరిగానే వెళ్లేదానిని. సాయంత్రం ఇంటికొచ్చాక నా చుట్టూ ఎవరూ ఉండేవారు కాదు. అమ్మ నాతో లేకపోవడం ఎంతో బాధించేది. రోజంతా కష్టపడి ఇంటికి వచ్చేసరికి అమ్మ భోజనం సిద్ధం చేసేది, తనతో కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేదానిని. అమ్మ రెండో పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో తనని బాగా మిస్ అయ్యా. చిత్ర పరిశ్రమలో ఇన్ని గంటలు మాత్రమే షూటింగ్‌లో పాల్గొనాలనే నిబంధన ఏం ఉండేది కాదు. దాంతో 10 నుంచి 12 గంటల పాటు సెట్‌లోనే ఉండేదానిని గిరిజా ఓక్ అన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











