నా అశ్లీల ఫోటోల్ని నా కాడుకు చూస్తే... స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

కేవలం సింగిల్ ఫోటోతో దేశవ్యాప్తంగా పాపులర్ కావడంతో పాటు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు మరాఠీ ముద్దుగుమ్మ గిరిజా ఓక్ గాడ్బోలే. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్యూలో ఆమె ఫోటోలు వైరల్ కావడంతో పాటు నాటి నుంచి నేషనల్ క్రష్‌గా మారిపోయారు గిరిజ. వైట్ స్కిన్‌ టోన్, తేనె కళ్లతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నారు. అయితే అనుకోకుండా వచ్చిన ఈ పాపులారిటీతో గిరిజ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అలాగే దీని వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఈ ముద్దుగుమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

సింగిల్ ఇంటర్వ్యూతో పాపులర్
హిందీ, మరాఠీలలో పలు భాషల్లో నటించిన గిరిజా ఓక్.. ఇటీవల గుల్షన్ దేవయ్యతో కలిసి ఆమె థెరపీ షెరపీ అనే ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. అయితే ఇందులో ఓ ఇంటిమేట్ సీన్ ఉండగా.. గుల్షన్ షూటింగ్ సమయంలో తనతో ఎలా వ్యవహరించింది... ఎలా తనలోని భయం పొగొట్టాడు అనే వివరాలను ఓ ఇంటర్వ్యూలో గిరిజ పంచుకున్నారు. ఇంటిమేట్ సీన్స్ తీయడం అంత తేలికకాదని.. కానీ గుల్షన్ తనతో అంతా కంఫర్ట్‌గా ఉందా? లేదా? అని దాదాపు 17 సార్లు అడిగారని గిరిజ తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె అందం, మాట తీరు, కట్టుబొట్టు అన్ని ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ఇంటర్నెట్‌లో ఆమె ఫోటోలు వైరల్ అయ్యాయి. ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్‌లో పాపులర్ అయ్యింది గిరిజ.

Girija Oak Godbole serious on AI-morphed vulgar pics amid viral Blue Saree fame

పాపులారిటీతో ఇబ్బందులు
అయితే అనుకోకుండా వచ్చిన పాపులారిటీతో తాను ఇబ్బందులు పడుతున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గిరిజ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆన్‌లైన్‌లో తన గురించి వస్తున్న అటెన్షన్ వెన్నులో వణుకు పుట్టుకొస్తోంది.. ప్రజలు నన్ను ఎంతగానో అభిమానిస్తున్నారు. తనకు కంటిన్యూగా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి.. కొన్ని మీమ్స్ కూడా గమ్మత్తుగా ఉన్నాయి. అయితే ఏఐ టెక్నాలజీని ఉపయోగించి నా ఫోటోలను కొందరు మార్ఫింగ్ చేస్తున్నారు. అభ్యంతకరంగా ఉన్న ఆ ఫోటోలు చూసేందుకు చాలా అసౌకర్యంగా ఉన్నాయి.. ఇష్టమొచ్చినట్లుగా ఎడిటింగ్ చేస్తున్నారు అని గిరిజా ఓక్ ఫైర్ అయ్యారు.

నా అశ్లీల ఫోటోలు నా కొడుకు చూస్తే
నాకు 12 ఏళ్ల కొడుకు ఉన్నాడు.. రేపో మాపో వాడు సోషల్ మీడియాలోకి అడుగుపెడితే నా మార్ఫింగ్ ఫోటోలు వాడు చూడకపోడు. అదే జరిగితే మా అమ్మ అభ్యంతరకర ఫోటోలు ఆన్‌లైన్‌లో ఉన్నాయని వాడు బాధపడతాడు. ఈ ఆలోచనే నన్ను కుంగదీస్తోంది. కేవలం వ్యూస్, పబ్లిసిటీ కోసమే కొందరు ఇలాంటి దారుణాలకు తెగబడుతున్నారు. ఒక మహిళ ఫోటోలను ఇలా అభ్యంతరకరంగా మార్చే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని గిరిజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

దయచేసి ఆపేయండి
ఫోటోలు మార్ఫింగ్ చేసేవారే కాదు.. వాటిని చూసి ఆనందించే వారు కూడా ఈ తప్పుడు పనిలో పాలు పంచుకున్నట్లే. ఇలాంటి వాటికి దయచేసి ఫుల్ స్టాప్ పెట్టేయండి. కానీ ఉన్నపళంగా ఉన్న పాపులారిటీతో తాను ఎక్కువమందికి దగ్గరయ్యానని.. అలాగే నా సినిమాలు, సిరీస్‌లను ఎక్కువ మంది చూస్తారని గిరిజా ఓక్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: gulshan devaiah girija
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X