లిప్‌లాక్ సీన్స్‌పై గిరిజా ఓక్ షాకింగ్ కామెంట్స్.. చెమటలు చిందించాల్సిందేనంటూ..
సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరు ట్రెండ్ అవుతారో, ఎందుకు వైరల్ అవుతారో చెప్పడం కష్టం. గత రెండు వారాలుగా నెట్టింట్లో ఎక్కడ చూసిన ఆమె ఫొటోలే, ఆమె వీడియోలే కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరు అనే సందేహం చాలా మందిలో ఉంది. ఆ ట్రెండింగ్ బ్యూటీ ఎవరో కాదు మరాఠీ ముద్దుగుమ్మ, నటి గిరిజా ఓక్ (Girija Oak). మరాఠీ, హిందీ చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న గిరిజా.. తారే జమీన్ పర్ లో అమిర్ ఖాన్‌తో, జవాన్ లో షారుక్ ఖాన్‌తో నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియా సంచలనంగా మారింది. తాజాగా లిప్ లాక్ సీన్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసి, వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఏమన్నారంటే?
నటి గిరిజా ఓక్ ఒక ప్రముఖ బాలీవుడ్ చాట్ షోకు గెస్ట్‌గా హాజరైంది. ఆ సందర్భంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా నెట్టింటంతా వైరల్ అయ్యాయి. సినిమాల్లో రొమాంటిక్ సీన్లు చేసేటప్పుడు ఎలా ఉంటుంది? అనే ప్రశ్నకు గిరిజా సమాధానం ఇస్తూ.. "సెట్లో చుట్టూ ఎంతో మంది ఉంటారు. అందరి మధ్య రొమాంటిక్ సీన్ చేయాల్సి వస్తే చాలాసార్లు ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కోసారి ఎన్నో టేక్స్ పడతాయి," అంటూ చెప్పింది.అయితే నటుడు గుల్షన్ దేవయ్యతో చేసిన సీన్ల గురించి మాట్లాడుతూనే గిరిజా మెచ్చుకుంది.

"ప్రతి టేక్ తర్వాత 'నీకు కంఫర్ట్‌గా ఉందా? ఏమైనా ఇబ్బంది ఉందా?' అని 17 సార్లు అడిగేవారు. ఇలా కో-స్టార్ కంఫర్ట్‌ను అంతగా పట్టించుకునే నటుడు నేను చూసింది చాలా అరుదు," అని ఆమె ప్రశంసించింది. ఈ ఇంటర్వ్యూ క్లిప్ బయటకు వచ్చిన వెంటనే గిరిజా ఓక్ కొత్తగా వైరల్ స్టార్‌గా మారింది.ఆమె మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయంగా మారింది. ఇలా ఒక్క ఇంటర్వ్యూతో గిరిజా ఓక్ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా గిరిజా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఇంటిమేట్ సీన్స్ గురించి చెప్పిన విషయాలు సినిమా లవర్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
ఇటీవల లల్లంటాప్ ఇచ్చిన ఇంటర్వ్యూలో గిరిజా ఓక్ ఈ విషయంపై ఓపెన్‌గా మాట్లాడింది. స్క్రీన్‌పై ఒక తెలియని వ్యక్తితో రొమాన్స్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవుతారు? ముఖ్యంగా కిస్సింగ్ షాట్లు ఎలా షూట్ చేస్తారు? ఆ సన్నివేశాలకు ప్రత్యేకమైన నైపుణ్యం అవసరమా? అని ప్రశ్నించగా, చాలామంది మహిళలు కూడా ఇదే ప్రశ్న అడిగారని చెప్పింది. అయితే షూటింగ్ సమయంలో మొత్తం ప్రక్రియ ' అంతా మెకానికల్'గా ఉంటుందని, నిజమైన భావాలకు అక్కడ ఏమాత్రం చోటు ఉండదని స్పష్టం చేసింది.
"షూట్ సమయంలో సౌండ్‌కి ఇబ్బంది కాదని ఏసీలను ఆఫ్ చేస్తారు. దీంతో చెమటలు కారుతూనే ఉంటాయి. దీంతో ఎవరో ఒకరు హెయిర్‌డ్రయర్ పెట్టి చెమట తుడుస్తుంటారు. ఇంకో పక్క హెయిర్ స్టైలిస్ట్ వచ్చి హెయిర్ సెట్ చేస్తారు. మరోవైపు లైట్ కింద నుంచి బాగా పడటం లేదని థర్మాకోల్ తీసుకొస్తారు. ఇలా ఇన్ని కళ్ళు చూస్తున్నప్పుడు... రొమాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది?. అది పూర్తిగా ఒక మెకానికల్, టెక్నికల్ ప్రాసెస్ మాత్రమే" అని గిరిజా నవ్వుతూ చెప్పింది.
"స్క్రీన్‌పై కిస్ అంటే... కార్డ్‌బోర్డ్‌ని కిస్ చేసినట్టే!"
అలాగే కిస్సింగ్ సీన్స్ గురించి ఆమె మరింత షాకింగ్ వివరాలు కూడా గిరిజా చెప్పింది. "ఎవరైనా స్క్రీన్‌పై కిస్ ఎలా అనిపిస్తుంది అని అడిగితే... 'కార్డ్‌బోర్డ్ ను ముద్దు పెట్టినట్టే అనిపిస్తుంది అంటాను. ఏమాత్రం ఎమోషన్ ఉండదు. మీ క్లోజప్ తీసేటప్పుడు, ఎదుటివాడు అక్కడే ఉండడు కూడా. చాలా సార్లు నేను కెమెరా దగ్గర ఉన్న ఒక స్టాండ్, థర్మాకోల్ ముక్క లేదా బ్లాక్ క్లాత్ చూసుకుంటూ రొమాంటిక్ డైలాగులు చెప్పాల్సిందే. నేను చాలాసార్లు థర్మాకోల్ షీట్‌ను చూస్తూ రొమాంటిక్ డైలాగ్స్ చెప్పాను " అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలా తెర వెనుక జరిగే అసలు సీక్రెట్ బయటపెట్టారు గిరిజా ఓక్.


Click it and Unblock the Notifications











