బీచ్‌లో భర్తతో శృంగార సరసాలు .. ప్రియాంక చోప్రా న్యూ ఇయర్ వెకేషన్ ఫోటోలు ట్రెండింగ్

హీరోయిన్ అంటే వైట్ స్కిన్ టోన్, అంద చందాలు కావాల్సిందే. కానీ కొందరు ముద్దుగుమ్మలు మాత్రం ఇలాంటి కొలమానాలకు అతీతం అని నిరూపించారు. ఈ కోవలోకే వస్తారు బాలీవుడ్ డస్కీ బ్యూటీ ప్రియాంక చోప్రా. పెద్ద అందగత్తె కాకపోయినా తన టాలెంట్‌ను నమ్ముకుని బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ప్రతిభ ఉంటే, కష్టాలై ఎదుర్కొనే దమ్ముంటే ఎప్పటికైనా విజయం సాధించొచ్చని ఆమె నిరూపించారు.

18 జూలై 1982న జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జన్మించారు ప్రియాంక చోప్రా. తల్లిదండ్రులు మధుచోప్రా, అశోక్ చోప్రా. వీరిద్దరూ భారత సైన్యంలో డాక్టర్లుగా పనిచేస్తూ దేశానికి ఎనలేని సేవ చేశారు. ప్రియాంక చోప్రా కుటుంబం హర్యానాలోని అంబాలాకి చెందినది. అయితే తల్లిదండ్రుల ఉద్యోగ రీత్యా వారు దేశంలోని పలు ప్రాంతాల్లో పెరిగారు. ప్రియాంకకు సిద్ధార్ధ్ అనే తమ్ముడు ఉన్నాడు. బాలీవుడ్ ముద్దుగుమ్మలు పరిణితి చోప్రా, మీరా చోప్రా, మన్నారా చోప్రాలు ప్రియాంకకు కజిన్స్ అవుతారు. వీరు ఇండస్ట్రీలోకి రావడానికి ప్రియాంకయే కారణం అని విశ్లేషకులు అంటూ ఉంటారు.

Global Actress Priyanka Chopra Bikini show at new year 2025 vacation

చదువు పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ వైపు వచ్చిన ప్రియాంక .. 2000వ సంవత్సరంలో మిస్ వరల్డ్ 2000 కిరీటాన్ని గెలుచుకోవడంతో ఆమె పేరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోయింది. మోడల్‌గా దేశంలోని టాప్ బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించిన ఆమె తర్వాతి కాలంలో సినిమాల్లోకి అడుగుపెట్టారు. తొలుత తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు ప్రియాంక చోప్రా.. ఆ తర్వాత హిందీ పరిశ్రమలో వరుస అవకాశాలను అందుకుని షార్ట్ గ్యాప్‌లోనే స్టార్ హీరోయిన్‌గా నిలిచారు.

ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ప్రియాంక చోప్రా పలుమార్లు చోటు దక్కించుకున్నారు. సినీ రంగానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2016లో పద్మశ్రీ పురస్కారంతో ఆమెను సత్కరించింది. తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్, హాలీవుడ్ రేపర్ నిక్ జోనాస్‌ను 2018లో ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం సరోగసీ ద్వారా కుమార్తె మాల్టీకి జన్మనిచ్చారు . పెళ్లి తర్వాత బాలీవుడ్‌ను దాదాపుగా పక్కన పెట్టేసిన ఆమె ఇండియాకు దూరంగా లాస్ ఏంజిల్స్‌లోనే ఉంటూ హాలీవుడ్‌లో దూసుకెళ్తున్నారు.

సినిమాలు, షూటింగ్స్ లేని సమయంలో భర్త, కుమార్తెతో గడపటానికే ఆమె ప్రాధాన్యతను ఇస్తారు. తాజాగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లారు ప్రియాంక చోప్రా. నిక్కర్ వేసుకుని సూర్యదోయాన్ని ఆస్వాదించిన ఆమె ఆపై రెచ్చిపోయారు. పలుచటి షర్ట్ వేసి లోపలి అందాలతో కనువిందూ చేస్తూ.. తన కుమార్తెను ఒళ్లో కూర్చోబెట్టుకుని బీచ్ వ్యూ చూపించింది. తర్వాత రెడ్ కలర్ బికినీ వేసి, పైన టోపి పెట్టి భర్తతో హాట్ హాట్‌ ఫోజుల్లో ఫోటోలు దిగి గిలిగింతలు పెట్టింది. మరి ఇంకేందుకు ఆలస్యం మీరూ కూడా ప్రియాంక చోప్రా అందాలపై ఓ లుక్కేయండి

More from Filmibeat

Read more about: priyanka chopra movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X