Priyanka Chopra : బికినీలో రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా .. నడిరోడ్డుపై అన్ని విప్పేసిందిగా
భారత్ నుంచి వెళ్లి గ్లోబల్ స్టార్‌గా వెలుగొందిన నటీనటులు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలాంటి వారిలో ఒకరు డస్కీ బ్యూటీ ప్రియాంక చోప్రా ఒకరు. ప్రస్తుతం ఇండియాలోనే కాదు హాలీవుడ్‌లోనూ అత్యధిక పారితోషికం అందుకుంటున్న మహిళా నటుల్లో ఆమె కూడా ఒకరు. రెమ్యునరేషన్, సంపద విషయంలో మేల్ సూపర్‌స్టార్స్ కూడా ప్రియాంక దరిదాపుల్లో లేరంటే ఆమె రేంజ్ అర్ధం చేసుకోవచ్చు.
18 జూలై 1982న జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో జన్మించారు ప్రియాంక చోప్రా. తల్లిదండ్రులు మధుచోప్రా, అశోక్ చోప్రా. వీరిద్దరూ ఇండియన్ ఆర్మీలో డాక్టర్లుగా పనిచేస్తున్నారు. నిజానికి వీరి కుటుంబం హర్యానాలోని అంబాలాకి చెందినది. ప్రియాంకకు సిద్ధార్ధ్ అనే తమ్ముడు ఉన్నాడు. బాలీవుడ్ హీరోయిన్స్ పరిణితి చోప్రా, మీరా చోప్రా, మన్నారా చోప్రాలు ప్రియాంకకు కజిన్స్. తల్లిదండ్రుల ఉద్యోగ రీత్యా ప్రియాంక దేశంలోని పలు ప్రాంతాల్లో పెరిగారు.

2000వ సంవత్సరంలో మిస్ వరల్డ్ 2000 కిరీటాన్ని గెలుచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రియాంక పేరు మారుమోగిపోయింది. మోడల్‌గా దేశంలోని టాప్ బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించిన ఆమె అనంతరం సినిమాల్లోకి అడుగుపెట్టారు. తొలుత తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు ప్రియాంక చోప్రా.. ఆ తర్వాత తన మకాంను మద్రాస్ నుంచి ముంబైకి మార్చారు. బాలీవుడ్‌లో వరుస అవకాశాలను అందుకుని తక్కువ టైమ్‌లోనే తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్‌గా నిలిచారు. భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్‌ను అందుకునే నటిగా అవతరించారు
ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ప్రియాంక చోప్రా పలుమార్లు చోటు దక్కించుకున్నారు. సినీ రంగానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2016లో పద్మశ్రీ పురస్కారంతో ఆమెను సత్కరించింది. తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్, హాలీవుడ్ రేపర్ నిక్ జోనాస్‌ను 2018లో ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం సరోగసీ ద్వారా కుమార్తె మాల్టీకి జన్మనిచ్చారు . పెళ్లి తర్వాత బాలీవుడ్‌ను దాదాపుగా పక్కన పెట్టేసిన ఆమె లాస్ ఏంజిల్స్‌లోనే ఉంటూ హాలీవుడ్‌లో మంచి అవకాశాలను అందుకుంటున్నారు.
వెబ్ సిరీస్‌లు, ఇంగ్లీష్ సినిమాల్లో ప్రియాంక లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. చాలా రోజుల తర్వాత మరాఠీలో తెరకెక్కిన పానీ మూవీలో ప్రియాంక చోప్రా నటించారు. సినిమాలు, షూటింగ్స్ లేని సమయంలో భర్త, కుమార్తెతో గడపటానికే ఆమె ప్రాధాన్యతను ఇస్తారు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ప్రియాంక చోప్రా తన సినిమాలు, వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
అలాగే హాట్ హాట్ ఫోటోషూట్‌లను చేసి వాటిని షేర్ చేస్తూ కుర్రాళ్లకి గిలిగింతలు పెడుతుంటారు. తాజాగా బికినీ వేసి దానిపై పలుచటి కవర్ మాదిరిగా ఉన్న డ్రెస్‌ను ధరించిన ప్రియాంక ఫోటోలు సెగలు రేపుతున్నాయి. ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు ఈ ఫోటోను షేర్ చేస్తూ ప్రియాంక చోప్రా అమెరికాలో హద్దులు దాటేసింది అంటూ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











