ఈ జీవితం పాతికేళ్ల కష్టం , ట్రోల్ చేయొద్దు ప్లీజ్.. నెటిజన్లకు దండాలు పెట్టిన ప్రియాంక చోప్రా

భారత్‌ నుంచి వెళ్లి గ్లోబల్ స్టార్‌గా వెలుగొందుతున్నారు డస్కీ బ్యూటీ ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ఇండియాలోనే కాదు హాలీవుడ్‌లోనూ అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఫిమేల్ యాక్టర్స్‌లో ఆమె కూడా ఒకరు. రెమ్యునరేషన్, సంపద విషయంలో మేల్ సూపర్‌స్టార్స్ కూడా ప్రియాంక దరిదాపుల్లో లేరు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు కొత్త సంగతులు పంచుకుంటూ ఉంటారు ప్రియాంక. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

తమిళ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన ప్రియాంక చోప్రా.. ఆ తర్వాత తన మకాంను ముంబైకి మార్చారు. బాలీవుడ్‌లో వరుస అవకాశాలను అందుకుని తక్కువ టైమ్‌లోనే తన అందం, అభినయంతో స్టార్ హీరోయిన్‌గా నిలిచారు. తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్, హాలీవుడ్ రేపర్ నిక్ జోనాస్‌ను 2018లో ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం సరోగసీ ద్వారా కుమార్తె మాల్టీకి జన్మనిచ్చారు .

Global star Priyanka Chopra shares her childhood pics photos goes viral

పెళ్లి తర్వాత బాలీవుడ్‌ను దాదాపుగా పక్కన పెట్టేసిన ఆమె లాస్ ఏంజిల్స్‌లోనే ఉంటూ హాలీవుడ్‌లో మంచి అవకాశాలను అందుకుంటున్నారు. వెబ్ సిరీస్‌లు, ఇంగ్లీష్ సినిమాల్లో ప్రియాంక లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. చాలా రోజుల తర్వాత మరాఠీలో తెరకెక్కిన పానీ మూవీలో ప్రియాంక చోప్రా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కోట్లలో ఆర్జిస్తున్న ప్రియాంకా చోప్రా.. తన సంపాదనను తెలివిగా పెట్టుబడులుగా మళ్లిస్తున్నారు. మొత్తంగా ఆమె ఆస్తుల విలువ రూ.450 - రూ.500 కోట్ల మధ్యలో ఉంటుందని అంచనా.

ఇక తన సినిమాలు, షూటింగ్స్‌కు ఏమాత్రం గ్యాప్ దొరికినా సరే భర్త, కుమార్తెతో కలిసి గడపటానికే ప్రియాంక ప్రాధాన్యతను ఇస్తారు. కొద్దిరోజుల క్రితం ఫ్యామిలీతో కలిసి సౌత్ ఫ్రాన్స్‌లో వెకేషన్‌కు వెళ్లింది ప్రియాంక. అక్కడ బికినీ వేసుకుని బీచ్‌లో పడవలో భర్త ఒళ్లో పడుకుని సెగలు రేపింది ప్రియాంక. ప్రస్తుతం సిటాడెల్ 2లో ఆమె నటిస్తున్నారు.. అలాగే సమంత- వరుణ్ ధావన్ నటించిన సిటాడెల్ హిందీ వెబ్ సిరీస్ ప్రీవ్యూ ఈవెంట్‌ లండన్‌లో జరగ్గా ఈ కార్యక్రమంలో ప్రియాంక సందడి చేశారు.

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రియాంక చోప్రా రెండు ఫోటోలు పంచుకున్నారు. అందులో తనకు 9 ఏళ్లు ఉన్నప్పటి ఫోటో, మిస్ వరల్డ్ అయినప్పటి ఫోటోను ఉంచారు. ఆ రోజులు తనకు ఇంకా గుర్తున్నాయని.. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే 25 ఏళ్లు గడుస్తున్నాయని నా జీవితం కూడా ఎంతో బాగుందని ప్రియాంక తెలిపారు. చిన్నప్పటి ఫోటోను , రీసెంట్ ఫోటోలతో పోల్చి కామెంట్స్ పెట్టొద్దని ప్రియాంక చోప్రా నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: priyanka chopra
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X