పేరుకే గ్లోబల్ బ్యూటీ.. టెంపుల్‌లో వారణాసి హీరోయిన్ చేసిన పని వైరల్!

గ్లోబల్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra). ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ లో అడుగుపెట్టి, పలు గ్లోబల్ సినిమాల్లో నటించి, మెప్పించింది. తాజాగా 'వారణాసి' సినిమాలో నటిస్తూ ఇండియన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. తన ఇమేజ్‌కు తగ్గట్టే ప్రతి అడుగులోనూ ప్రత్యేకతను చాటుకుంటోంది. హాలీవుడ్‌లో సక్సెస్ సాధించినప్పటికీ, భారతీయ మూలాలను మర్చిపోని వ్యక్తిత్వం ఆమెను మరింత ప్రత్యేకంగా నిలబెడుతోంది. తాజాగా గోల్డెన్ టెంపుల్‌ లో ఈ అమ్మడు చేసిన పనికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఏమన్నారంటే?

ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ 'వారణాసి'లో ప్రియాంక కీలక పాత్రలో నటిస్తోంది. గ్లోబల్ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే అవకాశముంది. 'మందాకిని' అనే పాత్రలో కనిపించనున్న ప్రియాంక, కథలో కీలక మలుపు తిప్పే పాత్ర పోషించనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. ముఖ్యంగా 'వారణాసి' వంటి భారీ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌లో భాగమవడం ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా భావిస్తున్నారు.

Global Star Priyanka Chopra Stuns Fans with Humble Service at Golden Temple

ఇక గ్లోబల్ ఇమేజ్ విషయానికి వస్తే.. ప్రియాంక 'సిటాడెల్' వెబ్ సిరీస్ సెకండ్ సీజన్‌లోనూ ఆమె బిజీగా ఉంది.అలాగే.. ఆమె నటించిన యాక్షన్ మూవీ 'ది బ్లఫ్' (The Bluff) ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కామన్ ఐలాండ్స్ నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ యాక్షన్ మూవీలో ప్రియాంక నటనకు మంచి గుర్తింపు దక్కుతోంది.అలాగే.. 'క్వాంటికో' సిరీస్‌తో అమెరికన్ టెలివిజన్‌లో తనదైన ముద్ర వేసిన ప్రియాంక, తర్వాత వరుసగా అంతర్జాతీయ సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగింది.

ఇదిలా ఉంటే.. తన సినిమాలతో గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రియాంక ఎంత పెద్ద స్టార్ తన మూలాలను మాత్రం అస్సలు మర్చిపోలేదు. ఇటీవల అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించింది. సాంప్రదాయ దుస్తుల్లో గుడికి వెళ్లిన ఆమె అక్కడున్నవారిని నవ్వుతూ పలకరించింది. ఆలయ సిబ్బంది సెల్ఫీ అడిగితే కాదనుకుండా ఓపికగా ఫోటోలు దిగింది. అనంతరం ఆలయసేవలో పాల్గొంది.

ఈ సేవ కార్యక్రమంలో గిన్నెలు కడుగుతూ, అక్కడి వారితో ఆత్మీయంగా మాట్లాడుతూ.. అందరితో కలిసిపోయింది. ప్రస్తుతం ఈ సేవ కార్యక్రమానికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రియాంక .. అభిమానులు ఆమె వినయాన్ని ప్రశంసించారు. 'గ్లోబల్ స్టార్ అయినా, ఆమె హృదయంలో భారతీయతే ఉంది', 'నిజంగా గ్రేట్‌' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పొగుడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X