బీచ్ లో పెళ్లి చూపులు జ్ఞానేశ్వరి రచ్చ... ఏకంగా అలా కనిపించి షాకిచ్చిందిగా!
జ్ఞానేశ్వరి కండ్రేగుల అంటే గుర్తు పట్టడం కష్టమే గాని యాంకర్ ప్రదీప్ మాచిరాజు పెళ్లి చూపులు షోలో విన్నర్ జ్ఞానేశ్వరి అంటే ఈజీగా గుర్తుపట్టేస్తారు జనం. ఆ షోతో పాపులర్ అయిన జ్ఞానేశ్వరి తర్వాత ఒక సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది, అయినా పెద్దగా స్టార్డం దక్కకపోవడంతో మరిన్ని అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.. ఈ క్రమంలో ఆమె బీచ్ ఒడ్డున రచ్చ చేస్తున్న వీడియో వీడియో షేర్ చేసింది ఆ వివరాల్లోకి వెళితే.

అనుకోకుండా
విశాఖపట్నంలో చదువుకుని హైదరాబాద్ జాబ్ నిమిత్తం వచ్చిన జ్ఞానేశ్వరికి అనుకోకుండా నటానా అవకాశాలు దక్కాయి. ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్న సమయంలో ఆమె కొలీగ్ చేస్తున్న ఒక షార్ట్ ఫిలింలో నటించాల్సి వచ్చింది.. దానికి బాగా పేరొచ్చింది. ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, ఇండిపెండెంట్ మూవీస్‌లలో ఆఫర్లు వచ్చినా నాకు యాక్టింగ్ మీద ఆసక్తి లేక చేయలేదని ఆమె చెబుతుంటుంది.

ప్రదీప్ పెళ్లిచూపులు
అయితే తర్వాత ఎందుకో ఆసక్తి కలగడంతో నటన మీద ఫోకస్ పెట్టానని ఒక సంధర్భంలో చెప్పుకొచ్చింది. అలా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసిన తర్వాత జీ చానల్ వారు నిర్వహించిన ప్రదీప్ పెళ్లి చూపులు షోలో పాల్గొన్న ఆమె ఇక వందల మందిలో సెలెక్ట్ కావడమే కాక చివరి వరకు నిలిచి ప్రదీప్ కి జోడీగా నిలిచింది. అయితే అదంతా షో వరకే అనుకోండి.

మిస్టర్ అండ్ మిస్
ఇక జ్ఞానేశ్వరి కాండ్రేగుల అశోక్ రెడ్డి దర్శకత్వంలో క్రౌడ్ ఫండెడ్ సినిమాగా రూపొందిన 'మిస్టర్ అండ్ మిస్' సినిమాలో నటించింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. కానీ దీనికంటే ముందే తనకు మంచి అవకాశాలు వచ్చాయని ఈ భామ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

అర్జున్ రెడ్డి ఎఫెక్ట్ తో మిస్
తన షార్ట్ ఫిలిం నచ్చి డైరెక్టర్ భరత్ కమ్మ ఆఫీసుకు రమ్మంటే వెళ్లి ఆడిషన్స్ లాగా యాక్టింగ్ డిస్కషన్స్‌లో పాల్గొన్నానని చెప్పుకొచ్చింది. అయితే తరువాత అర్జున్ రెడ్డి హిట్ అవ్వడంతో డియర్ కామ్రేడ్ కి సీనియర్ యాక్టర్స్‌ను తీసుకున్నారని అలా ఆ అవకాశం మిస్సయ్యాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ భామ.
హాట్ వీడియో
ఇక ఇప్పుడు పెద్దగా అవకాశాలు దక్కకపోవడంతో ఈ భామ హాట్ షోకి తెరలేపింది. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలతో తన ఫాలోవర్స్ ను ఎంగేజ్ చేస్తూ ఉండే ఈమె ఈరోజు అయితే ఏకంగా ఒక హాట్ వీడియో పోస్ట్ చేసింది. అందులో పైన టాప్ ఏమీ లేకపోగా స్పోర్ట్స్ వేర్ లో రచ్చ చేసింది. ఈ భామ ఇంత కష్ట పడుతుంటే అవకాశాలు వస్తాయేమో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











